twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రోబో యూనిట్ సభ్యుల వీరంగం.. ఇద్దరిపై దాడి, శంకర్ క్షమాపణ

    ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న రోబో షూటింగ్‌లో మీడియాకు చేదు అనుభవం ఎదురైంది. ఆ చిత్ర యూనిట్ సభ్యులు మీడియా ప్రతినిధులుపై దాడికి దిగారు. ఈ ఘటనపై వివాదం నెలకొనడం దర్శకుడు శంకర్ మీడియాకు క్షమాపణలు చెప

    By Rajababu
    |

    ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న రోబో షూటింగ్‌లో బౌనర్లు వీరంగం సృష్టించారు. ఇద్దరు ఫొటోగ్రాఫర్లపై ఆ చిత్ర యూనిట్ సభ్యులు దాడికి దిగారు. వివాదాలకు దూరంగా ఉండే శంకర్ చిత్ర యూనిట్ తాజాగా దాడికి దిగడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

    భిన్నవాదనలు

    భిన్నవాదనలు

    అనుమతి లేకుండా సెట్‌లోకి ప్రవేశించి ఇద్దరు ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీయడానికి ప్రయత్నించడంతో వారిని అడ్డుకొన్నామని, అంతేకాని వారిపై దాడి చేయలేదని యూనిట్ సభ్యులు పేర్కొన్నారు. అయితే తమకు ఎలాంటి సూచనలు చేయకుండానే దాడికి దిగారని మీడియా ప్రతినిధులు ఆరోపించారు.

    దాడికి అసలు కారణమిదే..

    దాడికి అసలు కారణమిదే..

    సినిమా షూటింగ్‌ జరుపుకోవడానికి రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల అనుమతి ఉంది. కానీ మీరు రూల్స్‌కు విరుద్ధంగా షూటింగ్ చేస్తున్నారు. అంతేకాకుండా రోడ్డుకు అడ్డంగా కారు వ్యాన్ పెట్టారు. ఇది రాకపోకలకు ఇబ్బందిగా మారింది. మీ తీరు వల్ల ప్రమాదం జరిగి ఓ మహిళ మరణించింది అని మీడియా ప్రతినిధి ప్రశ్నించాడు. కానీ రోబో యూనిట్ సభ్యుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆ ప్రాంతాన్ని తన కెమెరాలో బంధించేందుకు ప్రయత్నించాడు. అతడిని చిత్ర యూనిట్ సభ్యులు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటుచేసుకున్నది.

    బౌన్సర్లు దాడి చేశారు.

    బౌన్సర్లు దాడి చేశారు.

    నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ పబ్లిక్‌కు ఇబ్బంది కలిగిస్తున్న నేపథ్యంలో రోడ్డుకు అడ్డంగా ఉన్న వాహనాల ఫొటోలను తీస్తున్నాను. అంతలోనే బౌన్సర్లు వచ్చి నాపై దాడి చేశారు అని బాధితుడు రంగనాథన్ తెలిపాడు.

     కెమెరా ఇవ్వమని బౌన్సర్లు బెదిరించారు

    కెమెరా ఇవ్వమని బౌన్సర్లు బెదిరించారు

    రోడ్డుపై నిలిచిన వాహనాలను ఫోటోలు తీసి కెమెరా ఇవ్వమని బెదిరించారు. పబ్లిక్‌కు అసౌకర్యంగా ఉన్న వాహనాల ఫొటోలను చిత్రీకరించడం నేరం కాదు అని చెప్పిన తనపై బౌన్సర్లు దాడి చేశారు అని మరో బాధితుడు పేర్కొన్నారు.

     దాడి ఘటనలో ఒకరి అరెస్ట్

    దాడి ఘటనలో ఒకరి అరెస్ట్

    ఈ దాడి ఘటనకు సంబంధించి అసిస్టెంట్ డైరెక్టర్ పప్పును పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఈ ఘటన జరిగినప్పుడు షూటింగ్ స్పాట్‌లో రజనీకాంత్ గానీ, ఇతర నటీనటులు ఎవరూ లేరని తెలిసింది.

    దర్శకుడు శంకర్ క్షమాపణ

    దర్శకుడు శంకర్ క్షమాపణ

    రోబో సెట్లో జరిగిన ఘటనపై దర్శకుడు శంకర్ స్పందించారు. ఈ ఘటన చోటుచేసుకోవడం దురదృష్టకరం అని అన్నారు. దాడి ఘటన నేపథ్యంలో మీడియాకు శంకర్ వెంటనే క్షమాపణలు చెప్పారు.

    పూర్తి కావొచ్చిన 2.0

    పూర్తి కావొచ్చిన 2.0

    రోబో2 చిత్రానికి సంబంధించి షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. ఈ చిత్రంలో సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ విలన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా ఈ చిత్రంలో అమీ జాక్సన్, సుధాంశు పాండే, ఆదిల్ హుస్సేన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం దీపావళికి విడుదల కానున్నది.

    రికార్డు ధరకు శాటిలైట్ రైట్స్

    రికార్డు ధరకు శాటిలైట్ రైట్స్

    రోబో చిత్రానికి సంబంధించిన శాటిలైట్ హక్కులు రికార్డ్ స్థాయిలో అమ్ముడుపోయాయి. దాదాపు రూ.110 కోట్లు చెల్లించి హక్కులను జీటీవీ సొంతం చేసుకొన్న సంగతి తెలిసిందే.

    English summary
    Superstar Rajinikanth's 2.0 has landed itself in a fresh controversy when the crew members allegedly assaulted two photojournalists on the film's set. Two photojournalists were attacked by the crew members of superstar Rajinikanth-starrer sci-fi thriller 2.0.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X