రికార్డుస్థాయిలో 2.0 బిజినెస్.. రజనీ కెరీర్‌లోనే ఫస్ట్ టైమ్.. 29న రిలీజ్!
సూపర్‌స్టార్ రజనీకాంత్, గ్రేట్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన 'రోబో' ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మళ్ళీ ఇదే కాంబినేషన్‌లో రోబో చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న 3డి చిత్రం '2.0. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని నవంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

నవంబర్ 3న మూవీ ట్రైలర్
ఇటీవల విడుదలైన 2.0 చిత్రం టీజర్‌కు అనూహ్య స్పందన వచ్చింది. రజనీ, శంకర్ కాంబినేషన్ మరోసారి మ్యాజిక్ చేయబోతుందనే మాట వినిపిస్తున్నది. ఈ నేపథ్యంలో నవంబర్ 3న ఈ చిత్రం ట్రైలర్‌ను చెన్నైలో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో చాలా గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు.

రూ.550 కోట్ల బడ్జెట్‌తో
అంచనాలకు తగ్గట్టుగానే భారతీయ సినిమా చరిత్రలోనే గొప్పగా నిలిచే విధంగా 550 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్ వాల్యూస్‌తో హాలీవుడ్ స్థాయిలో ఈ చిత్రం రూపొందింది. లైకా ప్రొడక్షన్స్ మరియు కరణ్ జోహర్ సమర్పణలో సుభాష్ కరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

రూ.225 కోట్ల బిజినెస్
రోబో 2.0 చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డుస్థాయిలో జరిగినట్టు ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. రిలీజ్‌కు ముందే సుమారు రూ.225 కోట్ల బిజినెస్ జరిగిందనేది విశ్వసనీయ సమాచారం. ఈ చిత్రం సుమారు రూ.500 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రజనీ కెరీర్‌లోనే మొదటిసారి ఈ రేంజ్‌లో బిజినెస్ జరగడం విశేషం.

అక్షయ్ కుమార్ విలన్ పాత్రలో
సూపర్‌స్టార్ రజనీకాంత్ సరసన ఎమీ జాక్సన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ విలన్‌గా ఒక ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో సుధాంశు పాండే, ఆదిల్ హుసేన్, కళాభవన్ షాజాన్, రియాజ్ ఖాన్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎ.ఆర్.రెహమాన్, సినిమాటోగ్రఫీ: నిరవ్ షా, ఎడిటింగ్: ఆంటోని, నిర్మాణం: సుభాష్ కరణ్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శంకర్.


Click it and Unblock the Notifications











