దర్బార్ ప్రీ రిలీజ్ బిజినెస్.. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే అంత రాబట్టాల్సిందే!

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా రాబోతున్న తాజా సినిమా 'దర్బార్'. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రజినీకాంత్ జోడీగా నయనతార నటించింది. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న ఈ సినిమా జనవరి 9వ తేదీన విడుదలకు సిద్ధమైంది. ఈ మేరకు దర్బార్ నుంచి ఇప్పటికే విడుదలైన అప్‌డేట్స్ ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేయడంతో డిమాండ్ పెరిగింది.

ఈ నేపథ్యంలో ఈ చిత్రం చెప్పుకోదగ్గ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 14.2 కోట్ల మేర జరిగింది. సో విడుదల తర్వాత 'దర్బార్' బ్రేక్ ఈవెన్ సాధించాలంటే దాదాపు 15 కోట్లు రాబట్టాలి. మరోవైపు ఈ సంక్రాంతికి అల్లు అర్జున్ హీరోగా రాబోతున్న అల.. వైకుంఠపురములో, మహేష్ బాబు హీరోగా రాబోతున్న సరిలేరు నీకెవ్వరు సినిమాలు ఉన్నాయి. ఈ పోటీని తట్టుకొని దర్బార్ ఏ మేర కలెక్షన్స్ రాబడుతుందనేది ఆసక్తికరంగా మారింది.

 Rajinikanths Darbar Pre Release Business

ఇక రజినీకాంత్ గత సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే.. పెట్ట 13 కోట్లు, రోబో 2 - 71 కోట్లు, కాల 33 కోట్లు, కబాలి 32 కోట్లు బిజినెస్ చేసి సక్సెస్ అయ్యాయి. చూడాలి మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో 'దర్బార్' ఏ మేర రాణిస్తుందనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X