»   » రజనీ దిగులు: 50ఏళ్ల నిషేదాన్ని బద్దలు కొడుతున్న వేళ...

రజనీ దిగులు: 50ఏళ్ల నిషేదాన్ని బద్దలు కొడుతున్న వేళ...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కన్నడలో డబ్బింగ్ సినిమాలపై నిషేదం గత 50 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. ఏ సినిమా అయినా కన్నడలో డబ్ చేయకుండా నేరుగా విడుదల చేయాల్సిందే. కన్నడ చిత్ర సీమను రక్షించుకోవాలనే ఉద్దేశ్యంతో అప్పట్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. అక్కడ డబ్బింగ్ అయిన చివరి చిత్రం టాలీవుడ్ కి చెందిన ‘మాయా బజార్'.

అయితే ప్రస్తుతం కన్నడ చిత్ర సీమలో పరిస్థితులు పూర్తిగా మారాయి. డబ్బింగ్ సినిమాల కోసం అంటూ ఓ చాంబర్ కూడా ఏర్పాటయింది. ఇకపై ఇతర భాషల సినిమాలు కూడా ఇక్కడ అనువాదం కాబోతున్నాయి. రజనీకాంత్ యానిమేషన్ మూవీ ‘కొచ్చాడయాన్'తో డబ్బింగ్ సినిమాల పరంపర మొదలు కాబోతోంది.

Rajinikanth's film to be dubbed in Kannada!

రజనీకాంత్ నటించిన ‘కొచ్చాడయాన్' పెద్ద ప్లాప్ అయినా..... 50 ఏళ్లుగా సాగుతున్న నిషేదం ఈ సినిమాతో బద్దలవ్వడం విశేషం. ఆల్రెడీ నిర్మాతలకు తీవ్ర నష్టాలు మిగిల్చిన ఈ సినిమా కన్నడలో డబ్ అయి ఏమేరకు వసూలు చేస్తుందో చూడాలి.

ఇక....కన్నడలో డబ్బింగ్ సినిమాలకు అనుమతి లభించడం తెలుగు సినీ పరిశ్రమకు కలిసొచ్చే అంశమే. ఇప్పటి మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, పవన్ కళ్యాణ్ లాంటి టాలీవుడ్ స్టార్స్ నటించిన తెలుగు సిమాలు నేరుగా విడుదలైనా మంచి వసూళ్లు సాధిస్తుంటాయి. ఇక కన్నడలో డబ్ అయితే కలెక్షన్లు మరింత ఎక్కువగా ఉంటాయనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు నిర్మాతలు.

అయితే కన్నడలో డబ్బింగ్ చిత్రాలను వ్యతిరేకించే వారు కూడా ఉన్నారు. తొలుత సినిమాల విడుదల సమయంలో వారి ఆందోళన కొనసాగే అవకాశం ఉంది. అందుకే తొలి సినిమాగా రజనీకాంత్ ప్లాప్ మూవీ ‘కొచ్చాడయాన్'ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ డబ్బింగ్ వివాదం వల్ల తాను ఏమైనా ఇబ్బందుల్లో పడతానేమోనని ఆందోళనగా ఉన్నారట రజనీకాంత్. ఈ సినిమా రిలీజ్ సాఫీగా సాగితే మిగతా చిత్రాలు క్యూ కట్టనున్నాయి.

English summary
Despite the whole dubbing controversy in the Kannada film industy, it has been revealed that a Tamil film will be dubbed in Kannada. Yes, you read it right. The Kannada script of Rajinikanth's Kochadaiyaan is currently being prepared and work on the actual dubbing is said to begin in a few day's time.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu