కాలా చిత్రానికి ఊరట.. రిలీజ్‌కు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్
రజనీకాంత్ నటించిన కాలా చిత్రానికి ఊరట లభించింది. తన అనుమతి లేకుండా కథలోని కొన్ని సీన్లను, పాటలను ఉపయోగించుకొన్నారు. అందుచేత ఆ చిత్ర రిలీజ్‌ను నిలిపివేయాలని కేఎస్ రాజశేఖరన్ సుప్రీంకోర్టును అభ్యర్థించారు. ఈ చిత్రంపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ జస్టిస్ ఏకే గోయల్, అశోక్ భూషణ్ విచారించారు.
కాలా చిత్రం రిలీజ్ కోసం అందరూ వేచి చూస్తుండగా మీరు అడ్డుకోవాలని ఇంజక్షన్ ఆర్డర్ కోసం ప్రయత్నించడం సరికాదు అని పిటిషన్‌దారుకు కోర్టు సూచించింది. ఆ విధంగా కేఎస్ రాజశేఖరన్ అభ్యర్థనను నిరాకరిస్తూ కాలా రిలీజ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాలా చిత్ర రిలీజ్‌ను నిలిపివేయాలని రాజశేఖరన్ గతనెల 16న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మద్రాస్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టుకు నివేదించారు.

rajinikanth kaala k s rajashekaran a k goel ashok bhushan kaala release date రజనీకాంత్ కాలా కేఎస్ రాజశేఖరన్ ఏకే గోయల్ అశోక్ భూషణ్ కాలా రిలీజ్ డేట్


Click it and Unblock the Notifications