twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డెస్టినీ అంటే ఇదేనేమో? రజనీ జీవితంలో ఆశ్చర్య పరిచే మలుపులు!

    By Bojja Kumar
    |

    Recommended Video

    రజనీ ప్రభంజనం సృష్టిస్తారా ?

    విధి ఎప్పుడు ఎవరిని ఎలా ఎటువైపు తీసుకెళుతుందో.... కాలం ఎప్పుడు ఎవరినీ ఎలా పరీక్షిస్తుందో ఊహించడం కష్టమే. విధి నిర్ణయాలు, కాలం పెట్టే పరీక్షలు ఒక్కోసారి ఆశ్చర్యంగా ఉంటాయి. రజనీకాంత్ జీవితంలో ఇలాంటి ఊహించని మలుపులు, ఆశ్చర్య పరిచే విషయాలు చాలా చోటు చేసుకున్నాయి.

     ఇది విధిరాత కాకుంటే మరేమిటి?

    ఇది విధిరాత కాకుంటే మరేమిటి?

    ఇది విధి రాసిన రాత కాకుంటే మరేమిటి? మహారాష్ట్రకు చెందిన గైక్వాడ్స్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి..... కర్నాటకలో జన్మించడం ఏమిటి? అతడి ప్రయాణం తమిళనాడు వైపు సాగడం ఏమిటి? తమిళ బాషను ప్రేమించే తమిళ ప్రజలు తమ భాషవాడు కాక పోయినా, తమ రాష్ట్రంలో పుట్టినవాడు కాక పోయినా.... అతడిని నెంబర్ వన్ స్టార్‌ను చేయడం ఏమిటి? ఆ ప్రజల కోరిక మేరకు ఆయన రాజకీయాల్లోకి రావడం ఏమిటి?

     రజనీ జీవితంలో అతిపెద్ద మలుపు

    రజనీ జీవితంలో అతిపెద్ద మలుపు

    రజనీకాంత్ జీవితంలో అతిపెద్ద మలుపు దర్శకుడు బాలచందర్ పరిచయం అవ్వడం. ఆయన పరిచయం అయి ఉండక పోతే, తన సినిమాల్లో అవకాశం ఇచ్చి ఉండకపోతే రజనీకాంత్‌ ఉండేవాడు కాదేమో?

     బస్‌లో ఈల వేసే కండక్టర్... థియేటర్లో అభిమానులతో ఈలలు వేయించుకునే స్థాయికి

    బస్‌లో ఈల వేసే కండక్టర్... థియేటర్లో అభిమానులతో ఈలలు వేయించుకునే స్థాయికి

    రజనీ కాంత్ 1950 డిసెంబర్ 12న బెంగుళూరులో శివాజీ రావు గైక్వాడ్ గా జన్మించారు. తండ్రి రామోజీరావు గైక్వాడ్ పోలీస్ కానిస్టేబుల్. 16 ఏళ్ల వయసు నుండే శివాజీరావ్ గైక్వాడ్ పని చేయడం ప్రారంభించారు. సినిమాల్లోకి రాక ముందు బస్ కండక్టర్ పనిచేశారు. తమిళ దర్శకుడు కె. బాలచందర్ తను 1975లో తీసిన ‘అపూర్వ రాగన్గల్' సినిమాలో అవకాశం ఇచ్చారు. అతడే ఆయన పేరును ‘రజనీకాంత్'గా మార్చారు. అలా బస్సులో ఈల వేసే కండక్టర్.... ఆ తర్వాత తనదైన టాలెంటు, నిజాయితీతో థియేటర్లో అభిమానులతో ఈలలు వేయించుకునే స్థాయికి ఎదిగారు.

     ఆ స్టైల్, ఆ స్పీడ్ పుట్టుకతో వచ్చిందే

    ఆ స్టైల్, ఆ స్పీడ్ పుట్టుకతో వచ్చిందే

    రజనీకాంత్ సినిమాల్లో ఏ పనైనా చాలా స్పీడుగా, స్టైల్‌గా చేస్తుంటాడు. ఆ స్టైలు, స్పీడు ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. అయితే అది ఆయన సినిమాల్లోకి వచ్చిన తర్వాత మొదలు పెట్టింది కాదు.... చిన్నతనం నుండి ఆయన అంతే. కండక్టర్‌గా ఉన్న సమయంలోకూడా ఆయన వర్కింగ్ స్టైల్ విభిన్నంగా ఉండేది. ఎంత రష్ ఉన్నప్పటికీ టిక్కెట్లు చకచకా కట్‌ చేసి ఇచ్చేవారట.

     కళను నమ్ముకున్నోడు ఎప్పుడూ చెడిపోలేదు

    కళను నమ్ముకున్నోడు ఎప్పుడూ చెడిపోలేదు

    కళను నమ్ముకున్నోడు ఎప్పుడూ చెడిపోలేదు అని అంటుంటారు. శివాజీ రావ్ గైక్వాడ్ చేసింది కూడా అదే. చిన్నతనం నుండి ఆయనకు నాటకాలు వేయడం ఇష్టం. ఇతర పనులు చేస్తున్నప్పటికీ కళను వదిలిపెట్టలేదు. కళను నమ్ముకున్నాడు కాబట్టే రజనీకాంత్‌ను విధి ఇక్కడి వరకు తీసుకొచ్చిందని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు.

    చరిత్ర పరిశీలిస్తే....

    చరిత్ర పరిశీలిస్తే....

    చరిత్ర పరిశీలిస్తే.... శివాజీ గణేశన్, ఎన్టీఆర్, జయలలిత ఇలా ఎందరో సినిమాలతో తమ జీవితం మొదలు పెట్టి ప్రజల మనసులను గెలిచి.... తమను అభిమానించే వారి కోసం ఏదో చేయాలనే తపనతో రాజకీయాల్లోకి వచ్చిన వారు. ఇపుడు రజనీకాంత్ కూడా అదే దారిలో నడవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

    వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ

    వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ

    తనకు వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ రజనీ ఎదుగుతూ వచ్చారు. చిన్న పాత్రే అయినా తన స్టైల్‌, మేనరిజమ్స్‌తో అదరగొట్టేవారు. వయదినిలె చిత్రంలో కమల్ హాసన్ హీరో. రజనీకాంత్ చిన్న విలన్ పాత్ర చేశారు. కానీ సినిమా రిలీజ్‌ అయ్యాక థియేటర్లో రజనీకాంత్‌ డైలాగ్‌లు, మేనరిజమ్స్‌కు ఎక్కువ చప్పట్లు వచ్చాయి.

    ఆ సినిమాతో సూపర్ స్టార్

    ఆ సినిమాతో సూపర్ స్టార్

    తన మేనరిజం, స్టైల్‌, డైలాగ్‌ డెలివరీతో వరుస చిత్రాలను చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు రజనీ. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ ఇలా ప్రతీ భాషలోనూ నటిస్తూ దూసుకుపోయారు. 1978లో సుమారు 20కు పైగా చిత్రాల్లో నటించారు. ఈ నేపథ్యంలో ఆయన కథానాయకుడిగా నటించిన ‘భైరవి' బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అప్పుడే ఆయన పేరు ముందు ‘సూపర్‌స్టార్‌' అని వేశారు. రజనీ తన కెరీర్లో ఎన్నో గొప్ప చిత్రాల్లో నటించారు.

     విదేశాల్లో కూడా అభిమానులు

    విదేశాల్లో కూడా అభిమానులు

    రజినీకాంత్‌కు తనదైన స్టైల్‌తో దేశ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాయి. కేవలం మన దేశంలోనే కాదు మలేషియా, సింగపూర్, జపాన్ లాంటి దేశాల్లో కూడా రజనీకాంత్‌కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ స్థాయిలో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న ఇండియన్ స్టార్ రజనీకాంత్ ఒక్కరే.

     సేవా భావం

    సేవా భావం

    ఇతరులకు సేవ చేయడంలో, కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడంలో రజనీకాంత్ ఒక అడుగు ముందే ఉంటారు. ఆయనలోని మంచి గుణమే ఆయన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది.

    తన వల్ల ఎవరూ నష్టపోకూడదని

    తన వల్ల ఎవరూ నష్టపోకూడదని

    తన వల్ల ఎవరూ నష్టపోకూడదని రజనీకాంత్ అభిమతం. అందుకే తన సినిమాలు ప్లాప్ అయినతే... నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లు తన పరిహారం ఇస్తారు. అందుకోసం ఆయన ఎన్నోసార్లు తన సొంత డబ్బు ఖర్చుపెట్టారు.

    ఆధ్యాత్మిక భావాలు ఎక్కువే

    ఆధ్యాత్మిక భావాలు ఎక్కువే

    రజనీకాంత్‌లో ఆధ్యాత్మక భావాలు కూడా ఎక్కువే. రజనీ స్టార్‌ హోదా అనుభవిస్తున్న సమయంలో చెడు అలవాట్లకు బానిస అయ్యారు. మనశ్శాంతిని కోల్పోయారు. అపుడు అమితాబ్‌ సూచన మేరకు సచ్చిదానంద ఆశ్రమంలో కొద్దిరోజులు గడిపారు. అలా రజనీ తొలిసారి హిమాలయాలకు వెళ్లారు. ఇప్పటికీ వెళ్తూనే ఉన్నారు. అక్కడ రోజుల తరబడి తపస్సు చేస్తూ ఉంటారు.

     నిరాడంబర జీవితం

    నిరాడంబర జీవితం

    రజనీకాంత్‌ తన జీవితంలో, కెరీర్ పరంగా చాలా ఎత్తుకు ఎదిగారు. కానీ ఆయనలో ఎప్పుడూ ఆ గర్వం కనిపించలేదు. ఇప్పటికీ ఆయన చాలా నిరాడంబర జీవితం గడుపుతుంటారు. ఆయన జీవన శైలి కూడా ప్రజల్లో ఆయనపై ఇష్టాన్ని మరింత పెంచింది.

    ప్రజల కోరిక మేరకు రాజకీయాల్లోకి... ఇది మరో మలుపు కాబోతోందా?

    ప్రజల కోరిక మేరకు రాజకీయాల్లోకి... ఇది మరో మలుపు కాబోతోందా?

    తమిళనాడు రాజకీయ దుస్థితి చూసి.... ప్రజలు, అభిమానుల కోరిక మేరకు రజనీకాంత్ రాజకీయాల వైపు వస్తున్నారు. మరి ఇది ఆయన జీవితంలో మరో అతిపెద్ద మలుపు కాబోతోందనే అంటున్నారు విశ్లేషకులు.

     సినిమాల్లో నటిస్తానో? లేదో? అంతా భగవంతుడి చేతిలోనే

    సినిమాల్లో నటిస్తానో? లేదో? అంతా భగవంతుడి చేతిలోనే

    ‘‘ప్రస్తుతం నా చేతిలో రెండు చిత్రాలే ఉన్నాయి, ‘2.0' పూర్తయిన తర్వాత ‘కాలా' చిత్రంలో నటించనున్నాను. ఆ తర్వాత నటిస్తానో... లేదో.. అంతా ఆ భగవంతుడి చేతిలోనే...'' అంటూ పొలిటికల్ ఎంట్రీ ప్రకటన సందర్భంగా రజనీకాంత్ వ్యాఖ్యానించారు.

    అవే తన జీవితాన్ని మలుపు తిప్పాయన్న రజనీ

    అవే తన జీవితాన్ని మలుపు తిప్పాయన్న రజనీ

    తాను పేదరికం నుండి వచ్చానని, తన పెద్దన్న మేస్త్రీగా నెలకు రూ.70 సంపాదించి, అందులో రూ.35 తన చదువుల కోసమే ఇచ్చేవారని, ఆ అన్నయ్యే తనకు దైవసమానుడని తెలిపారు.

    1973లో తాను చెన్నై నగరంలో అడుగుపెట్టానని, దర్శకుడు కె.బాలచందర్‌ను కలుసుకోవడం, ఒకేసారి మూడు చిత్రాల్లో నటించమనడం తన జీవితాన్ని మలుపు తిప్పాయని రజనీ అభిమానుల మీటింగులో గుర్తు చేసుకున్నారు.

    అభిమానుల ప్రార్థనలే బ్రతికించాయి. వారి కోసమే వస్తున్నా

    అభిమానుల ప్రార్థనలే బ్రతికించాయి. వారి కోసమే వస్తున్నా

    తీవ్ర అనారోగ్యంతో సింగపూర్‌ ఆసుపత్రిలో స్పృహ లేకుండా ఉన్నప్పుడు, అభిమానులు జరిపిన ప్రార్థనల వల్లే బతికి బయటపడ్డానని... వారి కోసం ఏదైనా చేయాలనే ఉద్దేశ్యంతోనే తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు తెలిపారు.

    English summary
    Superstar Rajinikanth is way more than just an actor – he is almost considered as a God especially when it comes to his huge fan following down South.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X