తమిళ్ సరే... ‘కబాలి’తెలుగు టీజర్ చూసారా, టాక్ ఏంటి
హైదరాబాద్: సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా పా రంజిత్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న 'కబాలి' చిత్రం తెలుగు టీజర్ ఆదివారం సాయంత్రం విడుదలైంది. ఎప్పటిలాగే తలైవా తనదైన స్టైల్, డైలాగ్ డెలివరీతో అదరగొట్టేశాడు.
మిడిల్ ఏజ్డ్ మాఫియా డాన్ గా తెల్లని గెడ్డంతో రజినీకాంత్ తనదైన శైలిలో చాల విభిన్నంగా స్టైలిష్ గా కనిపించి అభిమానులకు పండుగ చేసారు. రజినీకాంత్ స్టైలిష్ నడకతో ఈ టీజర్ ప్రారంభమైంది.
ముఖ్యంగా 'పాత తెలుగు చిత్రాల్లో బుగ్గపై గాటు పెట్టుకుని, మీసాలు తిప్పుకొంటూ, లుంగీ కట్టుకుని పాత విలన్ ఏయ్! కబాలి అని పిలవగానే... వంగుని వినయంగా ఎస్ బాస్ అంటూ అని నిలబడతాడే ఆ కబాలి అనుకున్నావా?.. కబాలి... రా' అంటూ చెప్పిన డైలాగ్ అదరగొట్టిందంటున్నారు ఫ్యాన్స్.
మరోపక్క ఆదివారం ఉదయం విడుదల చేసిన కబాలి తమిళ టీజర్‌కు గంటలోనే మిలియన్ వ్యూస్ వచ్చేశాయి. అంతేకాకుండా తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలోని అందరు ప్రముఖులు రజనీ స్టైల్‌కు ఫిదా అయిపోయారు.

ఈ చిత్రంలో రజనీకాంత్‌కి జోడీగా రాధికా ఆప్టే నటించారు. కలైపులి ఎస్. థను నిర్మించిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం సమకూరుస్తున్నారు. ధన్షిక, కిషోర్, దినేష్ రవి, జాన్ విజయ్ తదితరులు చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు. చైనాకు చెందిన విల్సన్ చౌ విలన్ గా చేస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఎక్కువ భాగం మలేసియాలో జరిగింది.
నిర్మాత మాట్లాడుతూ ''తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్న చిత్రిమిది. సంతోష్ నారాయణ్ బాణీలు అందిస్తున్నారు. తెలుగులో సీతారామశాస్త్రి, చంద్రబోస్, అనంతశ్రీరామ్ సాహిత్యాన్ని అందిస్తున్నారు''అన్నారు. ఈ చిత్రానికి మాటలు: సాహితి, ఛాయాగ్రహణం:మురళీ, కళ: రామలింగం


Click it and Unblock the Notifications











