కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు రజనీకాంత్ ‘కొచ్చాడయాన్’

ఈ చిత్ర నిర్మాణ సంస్థ ఈరోస్ వైస్ ప్రెసిడెంట్ అమితా నాయుడు మాట్లాడుతూ 'కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కొచ్చాడయాన్ మూవీ ట్రైలర్ విడుదల చేయబోతున్నాం' అని తెలిపారు. రజనీకాంత్ కూతురు సౌందర్య దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రం మోషన్ కాప్చర్ టెక్నాలజీ ఉపయోగించి రూపొందిస్తున్న తొలి భారతీయ సినిమా. గతంలో అవతార్, టిన్ టిన్ లాంటి హాలీవుడ్ చిత్రాల్లో మాత్రమే ఈ టెక్నాలజీ ఉపయోగించారు.
కొచ్చాడయాన్ మూవీ మీడియా ప్రతినిధి మాట్లాడుతూ...'రజనీ సర్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరైన కొచ్చాడయాన్ మూవీ ట్రైలర్ ఆవిష్కరిస్తారు' అని తెలిపారు. ఈ చిత్రంలో దీపిక పడుకొనె, జాకీ ష్రాఫ్, శోభన, ఆర్ శరత్ కుమార్ తదితరులు నటిస్తున్నారు. ఈరోస్ ఎంటర్ టైన్మెంట్స్, మీడియా వన్ గ్లోబల్ ఎంటర్ టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నాయి. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రం ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ మే 15 నుంచి మే 26 వరకు జరుగనుంది. రజనీకాంత్, అమితాబ్ వచ్చన్ ఈ వేడుకకు హాజరు కానున్నారు. అమితాబ్ బచ్చన్ తను నటిస్తున్న హాలీవుడ్ మూవీ ప్రమోషన్లలో పాలుపంచుకోబోతున్నారు.


Click it and Unblock the Notifications











