twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విషాదంలో రజనీకాంత్.. తండ్రి లాంటి ఆత్మీయుడి మరణం!

    |

    సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు పలు సంవత్సరాలుగా మేకప్ మ్యాన్‌గా పనిచేసిన ఎల్ ముతప్ప ఇకలేరు. అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం ఉదయం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 75 సంవత్సరాలు. ఏవీఎం ముత్తప్పగా ఆయన సినీ పరిశ్రమలోని వారికి సుపరిచితులు. ముతప్ప మృతి తమిళ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భాంతికి లోనైంది. వివరాల్లోకి వెళితే..

    వృద్ధాప్యంతో బాధపడుతూ

    వృద్ధాప్యంతో బాధపడుతూ

    గత కొద్దికాలంగా వృద్దాప్య సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరణించారు. ముతప్ప మరణంతో రజనీకాంత్ విషాదంలో మునిగిపోయారు. కేవలం రజనీకాంత్‌కు మాత్రమే కాకుండా సినీ దిగ్జజాలు శివాజీ గణేషన్, కమల్ హాసన్‌కు కూడా మేకప్ మ్యాన్‌గా వ్యవహరించారు.

    తీవ్ర దిగ్భ్రాంతికి లోనైన రజనీ

    తీవ్ర దిగ్భ్రాంతికి లోనైన రజనీ

    ముతప్ప మరణంతో రజనీకాంత్‌తో సహా సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. మరణ వార్త తెలియగానే ముతప్ప నివాసానికి స్వయంగా వెళ్లి ఆయన పార్ధీవ దేహానికి శ్రద్ధాంజలి ఘటించారు. ముతప్పతో రజనీకాంత్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రజనీ సినిమాల్లో చిన్న పాత్రలు కూడా పోషించారు. రజనీకాంత్ ఇంటిలో జరిగే వేడుకలకు ముతప్ప కుటుంబాన్ని స్వయంగా ఆహ్వానించేవారు అని సన్నిహితులు పేర్కొన్నారు.

    రెండో తండ్రి అని రజనీకాంత్

    రెండో తండ్రి అని రజనీకాంత్

    రజనీకాంత్‌తో ముతప్ప పలు విషయాలను పంచుకొనే వారు. రజనీకాంత్ తండ్రిని కలుసుకొన్న క్షణాలు బాగా గుర్తుంచుకొనే వారు. ముతప్ప నాకు రెండో తండ్రి లాంటి వారని రజనీకాంత్ స్వయంగా చెప్పుకొనే వారు. అలాగే రజనీకాంత్ తనకు కొడుకులాంటి వాడని ముతప్ప చెప్పుకొనే వాడు అని కుటుంబ సభ్యులు వెల్లడించారు.

    శివాజీ గణేషన్ సినిమాతో

    శివాజీ గణేషన్ సినిమాతో

    సినీ దిగ్గజం శివాజీ గణేషన్ నటించిన పరాశక్తి సినిమాతో ముతప్ప కెరీర్ ప్రారంభమైంది. దాదాపు 60 ఏళ్లు మేకప్ ఆర్టిస్టుగా ఏవీఎం స్టూడియోలో పనిచేశారు. ఆ తర్వాత రజనీకాంత్‌కు మేకప్ మ్యాన్‌గా పనిచేశారు. అలాగే కమల్ హాసన్ తొలి చిత్రం కలథూర్ కన్నమ్మ సినిమాకు కూడా ఆయన పనిచేశారు.

    ముతప్పకు ఘనంగా శ్రద్ధాంజలి

    ముతప్పకు ఘనంగా శ్రద్ధాంజలి

    ముతప్ప మృతికి తమిళ సినీ పరిశ్రమ, నిర్మాతల మండలి సంతాపం వ్యక్తం చేసింది. ఆయన ఆత్మకు శాంతి కలుగాలని పలు సంఘాలు సంతాప ప్రకటనను విడుదల చేశారు. పలువురు హీరోలు, సినీ ప్రముఖులు శ్రద్ధాంజలి ఘటించిన వారిలో ఉన్నారు.

    English summary
    Makeup man Muthappa, who has worked with all the stalwarts of Tamil cinema including Sivaji Ganesan, Rajinikanth and Kamal Haasan, breathed his last today morning in Chennai. The veteran makeup artist was suffering from age-related ailments for the past few days. He was 75.Muthappa, who was popularly known as AVM Muthappa, worked as a makeup artist for about 60 years.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X