సూపర్ స్టార్ రజనీ గురించి బ్యాడ్ లేడీ..

By Bojja Kumar

తన ప్రవర్తనతో బ్యాడ్ లేడీ ఇమేజ్ సొంతం చేసుకున్న రాఖీ సావంత్ తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి వ్యాఖ్యలు చేసి వార్తల్లోకెక్కింది. రజనీకాంత్ నా డ్రీమ్ మ్యాన్. ఆయన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను అంటూ వ్యాఖ్యలు చేసింది. మీడియాలో పబ్లిసిటీ సంపాదించుకోవడానికే రాఖీ ఇలాంటి వ్యాఖ్యలు చేసిందని కొత్తగా చెప్పక్కర్లేదు.

అంతే కాదు రజనీకాంత్ అల్లుడు ధనుష్‌ను కూడా ఓ మోసేస్తోంది. ధనుష్‌కు నేను చాలా పెద్ద ఫ్యాన్‌ను అని, అతడు పాడిన 'కొలవెరి డి' పాట అద్భుతం, ఇటీవల అతడు ఓ స్టేజీ పెర్ఫార్మెన్స్‌‌లో అర్ధాంతరంగా తప్పుకోవడంతో చాలా అప్ సెట్ అయ్యాను అందరితో చెప్పుకుంటోంది.

ఐటం బాంబుగా బాలీవుడ్ కెరీర్ ప్రారంభించిన రాఖీ పలు సినిమాల ద్వారా వచ్చిన పాపులారిటీతో....బుల్లితెరపై ప్రవేశించింది, తన మాటలు, చేష్టలు, వివాదాలతో తరచూ మీడియాలో తన పేరు వినిపించేలా జాగ్రత్త పడుతూ ఎంటర్ టైన్మెంట్ రంగంలో తన బిజినెస్ పెంచుకుంటూ వెలులోంది.

గతంలో రాఖీ విషయంలో చోటు చేసుకున్న కొన్ని ఆసక్తికర ఘటనలు ఏమిటంటే....
ఆమధ్య ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో పట్టుబడిన ఇద్దరు దుండగుల దగ్గరనుండి ఇటాలియన్ పిస్టల్ ని ఒకటి అక్కడి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తుపాకీ యొక్క పుట్టు పూర్వోత్తరాలు తెలుసునే క్రమంలో దొంగలు చెప్పిన సమాధానం విని పోలీసులు నివ్వెరపోయారు. “మేం గతంలో రాఖీ సావంత్ ఇంటిని దోచుకున్నప్పుడు మాకది దొరికింది" అని దొంగలు చెప్పడంతో ఆశ్చర్యపొయిన ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు ముంబాయి పోలీసుల సహకారంతో కేసును దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే ఈ విషయమై రాఖీని స్పెషల్ పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉంది. ఇంతకీ విషయం ఏమిటి అని రాఖీ ని కదిపితే… నాకు ఆ పిస్టల్ కి ఎలాంటి సంబంధం లేదంటూ తనపై వచ్చిన అభియోగాన్ని తోసిపుచ్చింది. పైగా నేనే ఒక పిస్టల్ ని, ఇంకా వేరే పిస్టల్ ఎందుకు అనంటూ తనదైన శైలిలో జవాబిచ్చింది.

రామ్ చరణ్, చిరంజీవి సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ కు అవకాశం ఇస్తే అదరకొడతానని, వేరే ఆలోచన లేకుండా ఓకే చేస్తానని అప్పట్లో స్టేట్ మెంట్ ఇచ్చింది. మమ్మల్ని ఎవరూ పట్టించుకోవటం లేదు. ఐటం గర్ల్ గా సినిమాల్లోకి వచ్చిన తమకు..హీరోయిన్స్ పాత్రలు రావని, కానీ హీరోయిన్స్ మాత్రం తమ పాత్రలను లాగేసుకుంటున్నారని ఏడుపు మొహంతో చెప్పుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X