సంక్రాంతి బరిలో పేట.. ఫెర్ఫార్మెన్స్‌తో రజనీ ఇరుగదీశాడు.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
సర్కార్, నవాబ్ లాంటి హిట్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన అభిరుచిగల నిర్మాత వల్లభనేని అశోక్ హ్యాట్రిక్ దిశగా సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన "పెట్టా" చిత్రాన్ని "పేట" పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న విషయం విదితమే.ఈ సందర్భంగా చిత్ర నిర్మాత వల్లభనేని అశోక్ మీడియాతో మాట్లాడారు. పేట సినిమా గురించి పలు విషయాలను వెల్లడించారు.

రజనీకాంత్ రోరింగ్ పెర్ఫార్మెన్స్
సూపర్ స్టార్ రజినీకాంత్ రోరింగ్ పెర్ఫార్మెన్స్‌తో హైలెట్‌గా తెరకెక్కిన "పేట" అనే విజువల్ ఫీస్టును తెలుగు ప్రేక్షకులకు అందిస్తునందుకు సంతోషంగా ఉంది. చిత్రదర్శకుడు కార్తీక్ సుబ్భారాజ్ రజినీకాంత్‌కు వీరాభిమాని. ఆయన గతంలో పిజ్జా, జిగర్తాండ చిత్రాలతో సూపర్ హిట్ దర్శకుడిగా పేరు తెచ్చుకొన్నారు అని అన్నారు.

కార్తీక్ సుబ్బరాజన్ టేకింగ్ గురించి
ఇప్పుడు ఆయన రజినీకాంత్‌ను తెరకెక్కించిన విధానం తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంది. అలాగే సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ ఈ చిత్రానికి ఎక్స్ట్రార్డినరీ సంగీతాన్ని అందించారు. అలాగే ఈ చిత్రం లో ప్రతి ఒక్కరిపాత్రలు ఆకట్టుకుంటాయి. అటు మాస్ ఆడియెన్స్ ను ,ఇటు క్లాస్ ఆడియెన్స్ ను కట్టిపడేసే కమర్షియల్ అంశాలున్నమంచి చిత్రమిది అని నిర్మాత వల్లభనేని అశోక్ తెలిపారు.

తొలిసారి కన్నడలోకి పేట
అలాగే ఫస్ట్ టైం కన్నడ భాషలోకి డబ్ అయ్యి రిలీజ్ కాబోతున్నసినిమా ఇది. అలాగే డార్జిలింగ్ లాంటి హిల్ స్టేషన్ల్, సుందర ప్రదేశాల్లో, ఫారెన్ లొకేషన్లలో ఈ చిత్రాన్ని అందంగా తీర్చిదిద్దటం జరిగింది. అలాగే రజినీకాంత్ హిట్ మూవీ "బాషా" తరువాత మళ్ళీ సంక్రాంతి కి "పేట" రూపంలో థియేటర్లలో సందడి చేయటానికి రజినీకాంత్ గారు రావటం సంతోషంగా ఉంది అని వల్లభనేని పేర్కొన్నారు.

జనవరి రెండో వారంలో పేట
జనవరి మొదటి వారంలో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించి సంక్రాంతి కానుకగా రెండో వారంలో రిలీజ్ చేయనున్నాం అని వల్లభనేని అశోక్ అన్నారు.ఈ చిత్రంలో త్రిష, సిమ్రాన్, విజయ్ సేతుపతి, బాబీ సింహ, నవాజుద్దీన్ సిద్ధిఖీ, మాళవిక నాయర్, మేఘ ఆకాష్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనిరుద్,కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం: కార్తీక్ సుబ్భారాజ్, నిర్మాత: వల్లభనేని అశోక్.


Click it and Unblock the Notifications











