twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రజనీకాంత్ నిర్ణయం భేష్, పవన్ కళ్యాణ్ అదే దారిలో నడవాలి: వర్మ

    By Bojja Kumar
    |

    రజనీకాంత్ రాజకీయ ఆరంగ్రేటంపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఈ విషయమై ఆయన సోషల్ మీడియాలో స్పందిస్తూ.... రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడం 'ఈవెంట్‌ ఆఫ్‌ ది సెంచరీ'గా పేర్కొన్నారు. అంతే కాదు పవన్ కళ్యాణ్ గురించిన ప్రస్తావన కూడా తెచ్చారు.

     ఈ శతాబ్దపు అత్యుత్తమ ఘటన

    ఈ శతాబ్దపు అత్యుత్తమ ఘటన

    రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడం అనే అంశం ఈ శతాబ్దపు అత్యుత్తమ ఘటనల్లో ఒకటని రామ్ గోపాల్ వర్మ అభిప్రాయ పడ్డారు. రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీని తాను పూర్తిగా స్వాగతిస్తున్నట్లు వెల్లడించారు.

    Recommended Video

    Kamal's and Twitter reactions for Rajini's political entry
     వెయ్యి రెట్లు

    వెయ్యి రెట్లు

    పొలిటికల్ ఎంట్రీ గురించి తన నిర్ణయం వెల్లడించే సమయంలో రజనీకాంత్ తెరపై కనిపించే దానికంటే వెయ్యి రెట్లు ప్రభావవంతంగా కనిపించారు అని వర్మ పేర్కొన్నారు.

    మంచి నిర్ణయం

    మంచి నిర్ణయం

    రజనీకాంత్ రాజకీయ పార్టీ పెడతానని చెప్పి మంచి నిర్ణయం తీసుకున్నారని, తమిళనాడులో అన్ని అసెంబ్లీ స్థానాలకు తన పార్టీ తరుపున అభ్యర్థులను నిలబెడతానని చెప్పడం హర్షించ దగ్గ విషయమని వర్మ అన్నారు.

    పవన్ కళ్యాణ్ అదే దారిలో నడవాలి

    పవన్ కళ్యాణ్ అదే దారిలో నడవాలి

    పవన్ కళ్యాణ్ కూడా.... రజనీకాంత్ మాదిరిగా ఆత్మవిశ్వాసం, దైర్యంతో ముందుకు నడవాలని, రజనీకాంత్ పార్టీ పోటీ చేసినట్లే...... పవన్ కళ్యాణ్ కూడా తన పార్టీ తరుపున అన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాలని, ఆ విధంగా పవర్ స్టార్ ముందుకు సాగాలని సూచించారు.

    English summary
    "Rajnikanth’s political entry is the event of the century ..His stance and the way he spoke of his decision to start a party made Rajni look a thousand times more thundering than even the best of his super star on screen persona. I really wish P K also will have the same courage and confidence as the Thalaiva and contest in all the assembly seats like Rajnikant is doing in T N. PK is bound to sweep all the seats." RGV tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X