బ్రేకింగ్ న్యూస్: రోబో2.0కు ఎదురుదెబ్బ.. రిలీజ్ అనుమానమే..

రోబో2 చిత్ర రిలీజ్ గురించి ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. జనవరి 25న ఈ చిత్రం రిలీజ్ కావడం లేదని ట్రేడ్ అనలిస్టు రమేశ్ బాలా చేసిన ట్వీట్ సినీ వర్గాలను గందరగోళంలో పడేసింది.

By Rajababu

బాహుబలి తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేపుతున్న చిత్రం రోబో 2.0. సూపర్‌స్టార్లు రజనీకాంత్, అక్షయ్ కుమార్ నటించిన ఈ చిత్రాన్ని వీక్షించేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవలే దుబాయ్‌లో అంగరంగ వైభవంగా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. దాంతో రోబో 2.0 చిత్రంపై భారీ అంచనాలు పెరిగాయి. అయితే తాజాగా రోబో2 చిత్ర రిలీజ్ గురించి ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. జనవరి 25న ఈ చిత్రం రిలీజ్ కావడం లేదని ట్రేడ్ అనలిస్టు రమేశ్ బాలా చేసిన ట్వీట్ సినీ వర్గాలను గందరగోళంలో పడేసింది.

Recommended Video

Rajinikanth's Robo 2.0 Audio Launch Date Is Out ఖర్చు తెలిస్తే షాకవుతారు!
 రోబో2.0 రిలీజ్ వాయిదా

రోబో2.0 రిలీజ్ వాయిదా

గతంలో రోబో2.0ను దీపావళికి విడుదల చేయాలని భావించారు. ఆ తర్వాత 2017 జనవరి 25 తేదీకి మార్చారు. అయితే రోబో2.0 చిత్రం ఆ చిత్రం విడుదల కావడం లేదట. ఆ చిత్రాన్ని ఏప్రిల్ 13 తేదీకి వాయిదా వేశారు అని రమేశ్ బాలా ట్వీట్ చేశారు. రోబో రిలీజ్ డేట్ వాయిదా పడటంతో అక్షయ్ కుమార్ తాను నటించిన ప్యాడ్‌మ్యాన్ చిత్ర రిలీజ్‌ను జనవరిలో రిలీజ్ చేస్తున్నట్టు ఆదివారం ప్రకటించడం కూడా ఈ వార్తకు బలాన్ని ఇస్తున్నది.

 3డీ ఫార్మాట్‌లో రోబో2.0

3డీ ఫార్మాట్‌లో రోబో2.0

రోబో2.0 చిత్రం పూర్తిగా 3డీ ఫార్మాట్‌లో రూపొందిస్తున్నారు. కేవలం 3డీ ఫార్మాట్ కోసం రోబో2ను రూపొదించడం లేదు. కథ డిమాండ్ చేయడం వల్లే 3డీ ఫార్మాట్‌లో చిత్రీకరించాం. ప్రేక్షకులు అద్భుతమైన అనుభూతికి లోనవడం గ్యారెంటీ. చిత్ర నిడివి కేవలం 140 నిమిషాలు మాత్రమే అని దర్శకుడు శంకర్ ఇటీవల మీడియాకు వివరించారు.

 వీఎఫ్‌ఎక్స్ పనుల్లో జాప్యం

వీఎఫ్‌ఎక్స్ పనుల్లో జాప్యం

అత్యంత సాంకేతికతతో రోబో2ను తీర్చిదిద్దుతున్నారు. వీఎఫ్‌ఎక్స్ పనులను శరవేగంతో చేస్తున్నారు. అయితే ముందస్తు ప్రణాళిక ప్రకారం పనులు జరుగకపోవడం వల్ల రోబో2ను వాయిదా వేయాలనుకొంటున్నట్టు సమాచారం. అయితే అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడకపోవడంపై కచ్చితమైన సమాచారం అందుబాటులోకి రాలేదు.

27న రోబో2 ఆడియో వచ్చేసింది..

27న రోబో2 ఆడియో వచ్చేసింది..

అక్టోబర్ 27న రోబో2 ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని దుబాయ్‌లోని బుర్జ్ పార్క్ వద్ద నిర్వహించారు. ఆ కార్యక్రమంలో ఏఆర్ రెహ్మన్ లైవ్ ప్రదర్శన హైలెట్‌గా నిలిచింది. ఈ ఫంక్షన్ కోసం దాదాపు 12 కోట్ల రూపాయలను చిత్ర యూనిట్ ఖర్చు పెట్టింది. ఈ కార్యక్రమంలో రాజాలి, ఎంథిర లోగథు సుందరీ అనే పాటలను రిలీజ్ చేశారు.

 400 కోట్ల బడ్జెట్‌తో రోబో2

400 కోట్ల బడ్జెట్‌తో రోబో2

రోబో2.0 చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ రూపొందిస్తున్నది. ఈ చిత్ర బడ్జెట్ 400 కోట్లు. ఆసియాలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న చిత్రంగా ఓ ఘనతను సాధించింది. ఈ చిత్రంలో రజనీ, అక్షయ్‌తోపాటు అమీజాక్సన్, సుధాంశు పాండే, ఆదిల్ హుస్సేన్ తదితరులు నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X