రజనీ 'శివాజి 3డీ'విడుదల తేదీ ఖరారు

By Srikanya

హైదరాబాద్: రజనీకాంత్‌ నటించిన 'విక్రమసింహ'ను 12-12-12 అనే అరుదైన తేదీన తెరపైకి తీసుకురావాలనుకొన్నారు. తేదీలో అన్నీ పన్నెండులు ఉండటమే కాదు... ఆ రోజునే రజనీ జన్మదినం. ఈ సందర్భంగా 'విక్రమసింహ'ను విడుదల చేస్తే క్రేజ్‌ వస్తుందని దర్శకనిర్మాతలు భావించారు. అయితే ఆ చిత్రం ఇంకా నిర్మాణ దశలోనే ఉండటంతో వాయిదా వేశారు. అయితే రజనీ పుట్టిన రోజున ఆయన సినిమా ఒకటి విడుదలవుతోంది. అదేమిటంటే శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన 'శివాజి'.

2007లో వచ్చిన ఆ చిత్రానికి త్రీడీ హంగులు అద్దారు. ఇటీవలే ఆ సాంకేతిక కార్యక్రమాలు ముగిశాయి. చిత్ర నిర్మాణ సంస్థ ఏవీఎమ్‌ ఓ ప్రకటన విడుదల చేస్తూ ''రజనీకాంత్‌ పుట్టిన రోజు సందర్భంగా డిసెంబరు 12న శివాజి త్రీడీని తెరపైకి తీసుకొస్తున్నాము''అన్నారు. ఇందులో శ్రియ కథానాయికగా నటించింది. త్రీడీకి అనుగుణంగా చిత్ర నిడివిని కొంత వరకూ తగ్గించారు.

''నాన్నా పందులే గుంపుగా వస్తాయి.. సింహం ఎప్పుడూ సింగిల్‌గానే వస్తుంది'' అనే డైలాగు మరో సారి ధియోటర్ లో మారు మ్రోగనుంది. రజనీకాంత్ చిత్రం 'శివాజి'చిత్రాన్ని 3డిలోకి కన్వర్ట్ చేసి విడుదల చేస్తున్నారు. చిత్ర నిర్మాత ఎం.ఎస్‌.గుహన్ మాట్లాడుతూ...''మంచి కథ, కథనాలు, సాంకేతిక విలువలు ఉన్నాయి కాబట్టే 'శివాజి' చిత్రాన్ని త్రీడీలోకి మార్చాలనుకొన్నాం. అయితే ఈ విషయాన్ని మొదట్లో రజనీకాంత్‌కి కూడా చెప్పలేదు. సినిమా పూర్తయ్యాక చూపిద్దామనుకొన్నాం. ఇటీవల ఆయన త్రీడీలో కొన్ని సన్నివేశాల్ని చూసి.. తెరపైన ఉన్నది నేనేనా? అంటూ ఆశ్చర్యపోయారు'' అన్నారు‌.

అలాగే ''నాలుగు వందల మంది సాంకేతిక నిపుణులు యేడాదిపాటు నిర్విరామంగా కృషి చేసి ఈ చిత్రాన్ని త్రీడీలోకి మార్చారు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు.. అందరినీ అలరించేలా తీర్చిదిద్దారు. హాలీవుడ్‌ నుంచి వచ్చే ఈ తరహా చిత్రాల నిడివి తక్కువగా ఉంటుంది. అందుకే 'శివాజి' నిడివిని కూడా తగ్గించాం. ప్రస్తుతం సాంకేతికపరమైన కార్యక్రమాలు తుది దశలో ఉన్నాయి'' అన్నారు.

చిత్రాన్ని త్రీడీలోకి మారుస్తున్న ప్రసాద్స్‌ గ్రూప్స్‌ సంస్థ డైరెక్టర్‌ సాయిప్రసాద్‌ మాట్లాడుతూ ''టుడీ చిత్రాన్ని త్రీడీలోకి మార్చడం ఒక గొప్ప ప్రక్రియ. కొన్ని కారణాల దృష్ట్యా ఈ చిత్రాన్ని కొంత కుదించాం. 'శివాజి 3డి' నిడివి 2 గంటల 17 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ప్రస్తుతం 3డి వర్క్ తుదిదశకు చేరుకుందిమరిన్ని చిత్రాల్ని త్రీడీలోకి మార్చబోతున్నాము''అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X