రజనీకాంత్ ‘విక్రమసింహ’ ఆడియో ట్రాక్ లిస్ట్

By Bojja Kumar

హైదరాబాద్: సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తమిళ చిత్రం 'కొచ్చాడయాన్' తెలుగులో 'విక్రమసింహ' పేరుతో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం మార్చి 9వ తేదీన చెన్నైలోని 'సత్యం సినిమాస్'లో గ్రాండ్‌గా జరుగనుంది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ముఖ్య అతిథిగా హాజరై సీడీలను విడుదల చేయనున్నారు.

తాజాగా తెలుగు వెర్షన్ 'విక్రమసింహ'కు సంబంధించిన ఆడియో ట్రాక్ లిస్టు ఆన్ లైన్లో విడుదలైంది. అందులోని వివరాల ప్రకారం 'విక్రమసింహ' చిత్రంలో సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మొత్తం 9 పాటలు కంపోజ్ చేసినట్లు స్పష్టమవుతోంది. తెలుగు సినీ గేయ రచయితలు చంద్రబోస్, వనమాలి చెరో మూడు పాటలు రాయగా, అనంత శ్రీరామ్ రెండు పాటలు రాసారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సాధన సర్గమ్, హేమచంద్ర, మనో, చిన్మయి, లతా రజనీకాంత్, ఏఆర్ రెహమాన్, ఏఆర్ రిహానా ఈ చిత్రానికి పాటలు పాడారు.

 హైదరాబాద్: సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తమిళ చిత్రం ‘కొచ్చాడయాన్’ తెలుగులో ‘విక్రమసింహ’ పేరుతో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం మార్చి 9వ తేదీన చెన్నైలోని ‘సత్యం సినిమాస్’లో గ్రాండ్‌గా జరుగనుంది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ముఖ్య అతిథిగా హాజరై సీడీలను విడుదల చేయనున్నారు. తాజాగా తెలుగు వెర్షన్ ‘విక్రమసింహ’కు సంబంధించిన ఆడియో ట్రాక్ లిస్టు ఆన్ లైన్లో విడుదలైంది. అందులోని వివరాల ప్రకారం ‘విక్రమసింహ’ చిత్రంలో సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మొత్తం 9 పాటలు కంపోజ్ చేసినట్లు స్పష్టమవుతోంది. తెలుగు సినీ గేయ రచయితలు చంద్రబోస్, వనమాలి చెరో మూడు పాటలు రాయగా, అనంత శ్రీరామ్ రెండు పాటలు రాసారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సాధన సర్గమ్, హేమచంద్ర, మనో, చిన్మయి, లతా రజనీకాంత్, ఏఆర్ రెహమాన్, ఏఆర్ రిహానా ఈ చిత్రానికి పాటలు పాడారు. ‘విక్రమసింహ’ చిత్రం 3డిలో తెరకెక్కుతున్న పీరియడ్ డ్రామా మూవీ. కె.ఎస్.రవికుమార్ కథ అందించిన ఈచిత్రానికి రజనీకాంత్ కూతురు సౌందర్య దర్శకత్వం వహిస్తున్నారు. రజనీకాంత్ సరసన దీపిక పదుకొనె హీరోయిన్‌గా నటిస్తోంది. ఆర్ శరత్ కుమార్, ఆది, శోభన, రుక్మిణి విజయ్ కుమార్, జాకీ ష్రాఫ్, నాజర్ ఇతర ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రాజీవన్ మీనన్ ఈచిత్రానికి పని చేస్తున్నారు. అవతార్ లాంటి చిత్రాల్లో ఉపయోగించిన మోషన్ కాప్చర్ టెక్నాలజీనీ ఈ చిత్రంలో ఉపయోగిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఏప్రిల్ నెలలో ప్రక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

'విక్రమసింహ' చిత్రం 3డిలో తెరకెక్కుతున్న పీరియడ్ డ్రామా మూవీ. కె.ఎస్.రవికుమార్ కథ అందించిన ఈచిత్రానికి రజనీకాంత్ కూతురు సౌందర్య దర్శకత్వం వహిస్తున్నారు. రజనీకాంత్ సరసన దీపిక పదుకొనె హీరోయిన్‌గా నటిస్తోంది. ఆర్ శరత్ కుమార్, ఆది, శోభన, రుక్మిణి విజయ్ కుమార్, జాకీ ష్రాఫ్, నాజర్ ఇతర ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు.

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రాజీవన్ మీనన్ ఈచిత్రానికి పని చేస్తున్నారు. అవతార్ లాంటి చిత్రాల్లో ఉపయోగించిన మోషన్ కాప్చర్ టెక్నాలజీనీ ఈ చిత్రంలో ఉపయోగిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఏప్రిల్ నెలలో ప్రక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X