రాణాలో నటించడం థ్రిల్లింగ్‌గా ఉందన్న సూపర్ స్టార్ రజనీకాంత్
'రాణా' చిత్రంలో నటించడం తనకు థ్రిల్లింగ్‌గా ఉందని తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ అన్నారు. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో, రజనీ చిన్న కుమార్తె సౌందర్య నిర్మిస్తున్న 'రాణా' షూటింగ్ శనివారం చెన్నైలోని ఏవీఎం స్టూడియోలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా రజనీ విలేకరులతో మాట్లాడారు.
17వ శతాబ్దానికి చెందిన కథతో రూపొందుతున్న ఇలాంటి సినిమాలో నటించడం ఇదే తొలిసారని చెప్పారు. ఇది తనకు ఒక ఛాలెంజ్ లాంటిదని, అయితే తమ బృందమంతా కలసి దీనిని అధిగమిస్తామని ధీమా వ్యక్తం చేశారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో తాను త్రిపాత్రాభినయం చేస్తున్నానన్నారు. ఈ చిత్రంలో రజనీ సరసన బాలీవుడ్ భామ దీపికా పదుకొనే నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











