షారుఖ్ లగ్జరీ గిఫ్టును తిరస్కరించిన రజనీకాంత్
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా రూపొందిన భారీ బడ్జెట్ సినిమా 'రా.వన్". ఈ సినిమాలో ఆలిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ గెస్ట్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. రజనీ నటించడంతో రా.వన్ సినిమాను ఎగబడి మరీ చూశారు దక్షిణాది రజనీ అభిమానులు. దీంతో సినిమా సూపర్ హిట్టవ్వడమే కాదు, కోట్ల రూపాయల కలెక్షన్లు కురిపించింది. సినిమా విజయవంతం అవడంతో సినిమాకు పని చేసిన ముఖ్యమైన టెక్నీషియన్స్ తో పాటు అతిథి పాత్రలో నటించిన రజనీకాంత్ కు కూడా కోటి రూపాయల విలువ చేసే బి.ఎం.డబ్ల్యు 7సీరీస్ లగ్జరీ కార్లను బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించాడు షారుఖ్. షారుఖ్ కోట్లు ఖర్చుపెట్టి గిఫ్టు ఇస్తుండటంపై ఇటీవల మీడియాలో తెగ ప్రచారం జరిగింది కూడా.
అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం రజనీకాంత్ షారుఖ్ ఖరీదైన గిఫ్టును తీసుకోవడానికి తిరస్కరించాడని తెలిసింది. తనకు లగ్జరీ కార్లలో తిరిగే అలవాటు లేదని సున్నితంగా తన మనసులోని మాటను వెల్లడించాడు రజనీ. ఇంతకాలం రజనీకాంత్ యాక్షన్‌కు బోల్డయిన షారుఖ్ తాజాగా రజనీకాంత్ సింప్లిసిటీ చూసి మరోసారి బోల్డ్ అయ్యాడు. రజనీకాంత్ మరోసారి తన గొప్పతనాన్ని చాటాడని, కోటి విలువ చేసే గిఫ్టును తిరస్కరించి తాను సమాన్య జీవిని అని లోకానికి చాటి చెప్పాడని, అసలైన సూపర్ స్టార్ కు నిర్వచనం మా హీరో రజనీకాంత్ అంటూ ఆనంద పడిపోతున్నారు అభిమానులు.


Click it and Unblock the Notifications











