twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అలాంటి వ్యామోహం లేదు.. నేను కోరుకునేది అదొక్కటే.. రజినీకాంత్ సంచలన కామెంట్స్

    |

    సూపర్ స్టార్ రజినీకాంత్ మీడియా ముందుకొచ్చి సంచలన ప్రకటన చేశారు. తనకు ముఖ్యమంత్రి కావాలన్న ఆకాంక్ష లేదని కుండబద్దలు కొట్టేశారు. ఈ మేరకు ప్రజలు, ప్రభుత్వాలను ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఇంతకీ రజినీ ఏమన్నారు? ఆయన కోరిక ఏంటి? వివరాల్లోకి పోతే..

    Recommended Video

    Rajinikanth Set To Launch Party On April 14th | Oneindia Telugu
    ఉత్కంఠకు తెరదించిన రజనీకాంత్.. క్లారిటీ

    ఉత్కంఠకు తెరదించిన రజనీకాంత్.. క్లారిటీ

    15 ఏళ్లుగా తన రాజకీయ ప్రవేశంపై వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆయన రాజకీయ ప్రవేశం కావాలని చాలామంది కోరారు. ఈ నేపథ్యంలో 2017 డిసెంబర్ నెలలో తన రాజకీయ ప్రవేశంపై క్లారిటీ ఇచ్చారు రజినీకాంత్. ఇక తాజాగా రాజకీయాల్లో తన పాత్రపై కూడా ఆయన క్లారిటీ ఇచ్చేశారు.

    వ్యవస్థ మారాలన్న సూపర్ స్టార్

    వ్యవస్థ మారాలన్న సూపర్ స్టార్

    తమిళనాడులోని రజనీ మక్కల్ మండ్రల్ ఆఫీస్ బేరర్లతో సూపర్ స్టార్ రజనీకాంత్ భేటీ అయ్యారు. తన ఆలోచనలను స్పష్టంగా వివరించాలనుకుంటున్నట్లు చెప్పారు. ఈ వ్యవస్థ మారాలని, దీనిని సరిదిద్దవలసి ఉందని ఆ సమావేశంలో రజినీ పేర్కొన్నారు.

    ముఖ్యమంత్రి కావాలనే వ్యామోహం లేదు.. వాళ్ళకే ప్రాధాన్యత

    ముఖ్యమంత్రి కావాలనే వ్యామోహం లేదు.. వాళ్ళకే ప్రాధాన్యత

    తనలో ముఖ్యమంత్రి కావాలనే వ్యామోహం లేదని రజనీకాంత్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి పదవి గురించి తాను ఆలోచించడం లేదన్నారు. తన పార్టీలో యువతకు పెద్ద పీట వేస్తానని చెప్పారు. విద్యావంతులు, నిజాయితీపరులకు మాత్రమే పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి జయలలితను పరిపాలన గురించి కూడా ప్రస్తావించారు రజనీకాంత్. జయలలిత మరణానంతరం రాజకీయ లోటు నెలకొందని అన్నారు.

    విద్యావంతులైన యువత.. రాజకీయ పార్టీలు వ్యాపార సంస్థలుగా

    విద్యావంతులైన యువత.. రాజకీయ పార్టీలు వ్యాపార సంస్థలుగా

    తన పార్టీలో 65 శాతం మంది విద్యావంతులైన యువత ఉంటుందని చెప్పిన ఆయన.. నేడు రాజకీయ పార్టీలు వ్యాపార సంస్థల మాదిరిగా నడుస్తున్నాయని, వాటికి ఓట్లు మాత్రమే కావాలని అన్నారు. నాయకులు ప్రజల గురించి పట్టించుకోవడం లేదని అన్నారు. ప్రజల కోసం పని చేయవలసి ఉందని, నిజాయితీపరులకు తన పార్టీ తరపున పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తామని ఆయన చెప్పారు.

    దర్బార్ అనంతరం సూపర్ స్టార్..

    దర్బార్ అనంతరం సూపర్ స్టార్..

    ఇక రజనీకాంత్ సినిమాల విషయానికొస్తే.. దర్బార్‌ సినిమా అనంతరం ఆయన నటిస్తున్న సినిమా ‘అన్నాత్తే'. సిరుత్తై శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో లేడీ సూపర్‌స్టార్‌ నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీలో కీర్తి సురేష్‌, మీనా, ఖుష్బూ, ప్రకాష్‌ రాజ్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

    English summary
    Super star Rajinikanth and Nayanatra played leed roles on Darbar movie. Now Rajinikanth reacted on his political journey.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X