మంచి మససు చాటుకున్న రజినీ.. అజిత్, విజయ్‌లకూ లారెన్స్ అభ్యర్థన.. కోలీవుడ్ స్టార్స్ స్పందిస్తారా?

రాఘవ లారెన్స్ సినిమా రంగంలో తన ప్రతిభను ప్రదర్శించి ఎంతగా ఫేమస్ అయ్యాడో.. ఆయనలోని మంచి తనం ద్వారా అంతకుమించిన అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. సంపాదించిన డబ్బులో సగం సేవా కార్యక్రమాలకు వాడుతూ ఉంటాడు. అనాథలు, వృద్దులు, వివిక్షకు గురయ్యేవారు, దివ్యాంగులను అక్కున చేర్చుకుంటాడు. సాధారణ పరిస్థితుల్లోనే వారికి అండగా నిలబడే లారెన్స్ కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో సాయం చేయకుండా ఉంటాడు. ఈ కష్టకాలంలో వారిని ఆదుకునేందుకు ఇప్పటికే మూడు కోట్ల విరాళాన్ని అందించిన సంగతి తెలిసిందే.

Recommended Video

Rajinikanth Sent 100 Rice Bags,Need Ajith And Vijay's Help: Raghava Lawrence
అన్ని వర్గాల వారికి..

అన్ని వర్గాల వారికి..

కరోనా వైరస్ వల్ల ఉపాధి కోల్పోయి, తిండిలేక బాధపడుతున్న అందరికీ లారెన్స్ సాయాన్ని అందించాలని ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక సాయాన్ని ప్రకటించాడు లారెన్స్. అంతేకాకుండా సినీ కార్మికులకు, వికలాంగులకు, వృద్దులకు, తాను పుట్టి పెరిగిన ఊరికోసం ఇలా అందరికీ కలిపి మూడో కోట్ల విరాళాన్ని ప్రకటించాడు.

డ్యాన్సర్ల కోసం ప్రత్యేకంగా..

డ్యాన్సర్ల కోసం ప్రత్యేకంగా..

ఉపాధి లేక సతమతమవుతున్న డ్యాన్సర్లకు లారెన్స్ అండగా నిలబడ్డాడు. 23 మంది డ్యాన్సర్లు (హైద్రాబాద్ 10, చెన్నై 13) నేరుగా వారి ఖాతాల్లోకి రూ. 25 వేల చొప్పున రూ. 5,75,000 జమ చేసినట్టు తెలిపారు. అంతేకాకుండా డ్యాన్స్‌పై ఆధారపడిన వారిని ఆదుకోవడం తన బాధ్యత అని చెప్పుకొచ్చాడు.

వంద బస్తాల బియ్యం..


తాను ఇంతవరకు చేసిన సాయం సరిపోదని ఇంకా చేయాలని భావించాడు లారెన్స్. అయితే అంత పెద్ద పనిని తానొక్కడినే చేయలేనని భావించిన లారెన్స్.. తన దైవం అయిన రజినీని సాయం కోరాడట. వెంటనే స్పందించిన రజినీ వంద బస్తాల బియ్యాన్ని పంపించాడట. ఈ మేరకు లారెన్స్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడు.

విజయ్,అజిత్‌లకు అభ్యర్థన..

విజయ్,అజిత్‌లకు అభ్యర్థన..

కరోనా లాంటి కష్టసమయంలో సాయం చేయండని విజయ్,అజిత్, సూర్య వంటి హీరోలను అభ్యర్థించాడు. వారి అభిమానులను సైతం అర్థించాడు. ఎవరికి తోచినంత వారు ఇవ్వండని, వాటితో నిత్యావసర సరుకులు కొని ఆపదలో ఉన్నవారికి అందిస్తానని తెలిపాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X