హిందీలో పాట పాడిన రజనీకాంత్
చెన్నై : సూపర్ స్టార్ రజనీకాంత్ ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వంలో హిందీలో పాట పాడారు. ప్రస్తుతం రజనీకాంత్ తన కూతురు సౌందర్య దర్శకత్వంలో 'కొచ్చాడయాన్' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఆయన తొలిసారిగా హిందీలో పాట పాడారు.
కొచ్చాడయాన్ చిత్రాన్ని తమిళంతో పాటు, హిందీ, తెలుగులో కూడా విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రజనీకాంత్ నమ్మకాలకు సంబంధించిన ఓ పాట పాడించాల్సి ఉంది. ఇందులో భాగంగా తమిళంతో పాటు, హిందీలో కూడా ఆయన ఈ పాట పాడారు. ఈ పాటను ఇర్షాద్ కమిల్ రాసారు.
సినిమాకు సంబంధించిన ఇతర వివరాల్లోకి వెళితే....కొచ్చాడయాన్ సినిమా ఆసియాలోనే తొలి మోషన్ క్యాప్చర్ సినిమా. గతంలో ఈ టెక్నాలజీ హాలీవుడ్ సినిమాలు అవతార్, టిన్ టిన్ చిత్రాల్లో మాత్రమే ఉపయోగించారు. ఈ చిత్రంలో రజనీకాంత్ సరసన దీపిక పడుకొనె హీరోయిన్. శరత్ కుమార్, ఆది పనిశెట్టి, దీపిక పడుకొనె, శోభన, జాకీ ష్రాఫ్, నాజర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ఈరోస్ ఇంటర్నేషనల్, మీడియా వన్ గ్లోబర్ ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్రఖ్యాత మ్యూజీషియన్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. రాజీవ్ మీనన్ సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. తెలుగులో ఈచిత్రం 'విక్రమ సింహా' పేరుతో విడుదలకానుంది.


Click it and Unblock the Notifications











