క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కె.ఎస్. రామారావు నిర్మిస్తున్న బుజ్జిగాడు మేడిన్ చెన్నై సినిమా ఆడియో ఈ నెల 18న విడుదల కాబోతోంది. సందీప్ చౌతా సంగీత దర్శకత్వంలో రెడీ అయిన పాటలను దక్షిణాది సూపర్‌స్టార్ రజనీకాంత్ చేతుల మీదుగా విడుదల చేయటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయట. చెన్నైలోని ఆంధ్రా క్లబ్‌లో జరిగే కార్యక్రమంలో ఈ ఆడియో విడుదల జరుగుతుందిట. ప్రభాస్ హీరోగా చేస్తున్న ఈ సినిమాలో త్రిష, సంజన హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో ప్రభాస్ తూర్పు గోదావరి యాసకు తమిళ భాషను కలిపి గమ్మత్తుగా డైలాగులు చెప్తారట. ఈ సినిమా తమ బ్యానర్ లో గతంలో వచ్చిన చంటి చిత్రాన్ని క్రాస్ చేస్తుందని నిర్మాత ధీమాగా ఉన్నారు.