డే 1 రజనీకాంత్ టాప్, తర్వాత వీరే...(ఫోటో ఫీచర్)
హైదరాబాద్: రజనీకాంత్ మరోసారి చరిత్ర సృష్టించాడు. ఈ సారి ఆయన చరిత్ర సృష్టించింది బాక్సాఫీసు కలెక్షన్ల విషయంలో కాదు. డిజిటల్ ప్లాట్‌ఫాం విషయంలో చరిత్ర సృష్టించారు. నిన్న ట్విట్టర్లో చేరిన రజనీకాంత్.....తొలి రోజ అత్యధిక ఫాలోవర్స్‌ను సంపాదించుకున్న స్టార్‌గా రికార్డు నెలకొల్పారు.
ట్విట్టర్లో చేరిన రజనీకాంత్....24 గంటలు గడిచేలోగా 2.15 లక్షల ఫాలోవర్స్‌ను సొంతం చేసుకున్నారు. ట్విట్టర్‌కు సంబంధించి ఇండియన్ సినిమా సెలబ్రిటీల చరిత్రలో ఇదో రేర్ ఫీట్. సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఫీట్ చూసిన ట్వీట్ వరల్డ్ ఆశ్యర్య పోతోంది. ఇంతకు ముందు అమీర్ ఖాన్ లాంటి స్టార్లు తొలి రోజు భారీగా ఫాలోవర్స్‌ను సంపాదించుకున్నారు కానీ... రజనీకాంత్ రేంజిలో మాత్రం కాదు.
ట్విట్టర్లో తొలి రోజు అత్యధికంగా ఫాలోవర్స్‌ను సొంతం చేసుకున్న సినిమా సెలబ్రిటీల వివరాలు స్లైడ్ షోలో...

రజనీకాంత్
రజనీకాంత్ ట్విట్టర్ ఖాతాను ఫాలో అయ్యే వారి సంఖ్య ఒక్క రోజులో 2.15 లక్షలకు చేరింది.

అమీర్ ఖాన్
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ట్విట్టర్లో తొలి రోజు 46,000 మంది ఫాలోవర్స్ చేరారు.

అమితాబ్ బచ్చన్
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ట్విట్టర్ ఖాతాను తొలిరోజు ఫాలోఅయిన వారి సంఖ్య 37,500

సచిన్
సచిన్ టెండూల్కర్ ట్విట్టర్ ఖాతా తెరుస్తున్నారనే విషయం తెలియగానే తొలి రోజు 25 వేల మంది ఫాలో అయ్యారు.

సల్మాన్ ఖాన్
సల్మాన్ ఖాన్ ట్విట్టర్ ఖాతా తెరిచిన తొలి రోజు 19,000 మంది ఫాలో అయ్యారు.

షారుక్ ఖాన్
షారుక్ ఖాన్ ట్విట్టర్ ఖాతా తెరిచిన తొలి రోజు 11,000 మంది ఫాలో అయ్యారు.


Click it and Unblock the Notifications











