twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దేవుడు శాసించాడు.. అందుకే యూటర్న్.. భావోద్వేగంతో రజనీకాంత్ ట్వీట్

    |

    సూపర్‌స్టార్ రజనీకాంత్ డిసెంబర్ 31న తన రాజకీయ పార్టీ గురించి ప్రకటన చేస్తారని ఎదురు చూస్తున్న సమయంలో ఒక్కసారిగా షాకిచ్చారు. హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జి అయిన తర్వాత చెన్నైలోని తన నివాసానికి చేరుకొన్న తలైవా తన అభిమాన సంఘాల నేతలు, కుటుంబ సభ్యులతో విస్తృతంగా చర్చలు జరిపారు. అనంతరం తన ట్విట్టర్ అకౌంట్‌లో మూడు పేజీల ప్రకటనను షేర్ చేసి తన నిర్ణయాన్ని ప్రకటించారు... ట్విట్టర్‌లో తెలిపిన ప్రకారం....

    కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ తర్వాత

    కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ తర్వాత

    డిసెంబర్ 31న రాజకీయ పార్టీ ఏర్పాటుపై ప్రకటన చేయాలని భావించాను. అయితే ఆరోగ్య సమస్యలు తీవ్రతరమై వెంటాడుతున్న నేపథ్యంలో హాస్పిటల్‌లో చేరాల్సి వచ్చింది. అయితే కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ తర్వాత చాలా రకాల మందులు వాడుతున్నాను. అలాంటి సమయంలో వైద్యులు పూర్తి విశ్రాంతి అవసరం.. లేకపోతే ప్రాణాలకే ముప్పని హెచ్చరించారు అని రజనీ తన ట్విట్టర్‌లో తెలిపారు.

    ప్రజల్లోకి వెళ్లడం ప్రాణాలకే ముప్పు

    ప్రజల్లోకి వెళ్లడం ప్రాణాలకే ముప్పు

    ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయ ప్రచారం కోసం ప్రజల్లోకి వెళ్లడం ప్రమాదకరం. నా ఆరోగ్యంతోపాటు ప్రజలు, అభిమానులు ప్రాణాలను పణంగా పెట్టడం సరికాదనే సలహాలు, సూచనలు పరిగణనలోకి తీసుకొని నా నిర్ణయాన్ని మార్చుకొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ పార్టీ ఏర్పాటు సరైన నిర్ణయం కాదని, నా అభిమానులు, కుటుంబంతో చర్చించిన తర్వాత తెలుసుకొన్నాను అని రజనీ పేర్కొన్నారు.

    మరో మార్గంలో ప్రజాసేవ

    మరో మార్గంలో ప్రజాసేవ

    ఎప్పటి మాదిరిగానే ప్రజాసేవలో నిమగ్నమై ఉంటాను. రాజకీయంగా కాకుండా ప్రజాసేవ మరో మార్గం ద్వారా చేద్దాం. ప్రజల సంక్షేమం కోసం మరో మార్గంలో పోరాటం చేద్దాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయాల్లోకి నేను ప్రవేశించడం అంత సులభమైన కార్యం కాదని భావిస్తున్నాను. పార్టీ ఏర్పాటు విషయంలో నా నిర్ణయాన్ని వెనుకకు తీసుకొని ఎంతో మందిని బాధపెట్టాననే విషయం తెలుసు. అలా చేసినందుకు క్షమాపణ కోరుతున్నాను అని రజనీకాంత్ చెప్పారు.

    దేవుడు వార్నింగ్ ఇచ్చాడంటూ..

    దేవుడు వార్నింగ్ ఇచ్చాడంటూ..

    ఆరోగ్య సమస్యలను చూపి దేవుడు నాకు వార్నింగ్ ఇచ్చాడు. రాజకీయ పార్టీ ఏర్పాటు తర్వాత మీడియా, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తే అంత ప్రభావం ఉండదు. ప్రజలను చైతన్య పరచడంలో విఫలమయ్యే అవకాశం ఉంది. ఎన్నికల్లో విజయం సాధించడం అంత సులభం కాదు. ఇది వాస్తవం.. రాజకీయాల్లో రాణించాలంటే ఇలాంటి వ్యూహాలు సరిపోవు అంటూ రజనీకాంత్ ఉద్వేగంగా ట్వీట్ చేశారు.

    అభిమానులు క్షమించండి అంటూ రజనీ

    అభిమానులు క్షమించండి అంటూ రజనీ

    ఎన్నో ఆశలు పెట్టుకొన్న నా అభిమానులకు ఇలాంటి సందేశాన్ని ఇవ్వాల్సి రావడం చాలా బాధగా ఉంది. ప్రత్యక్షంగా రాజకీయాల్లో లేకుండా మనగడ, విజయం సాధించడం కష్టం. నా ముందుకు వచ్చే ప్రతీ మార్గంలో నేను ప్రజాసేవలో నిమగ్నమవుతానని మాటిస్తున్నాను. ఇది దేవుడు శాసించిన నిర్ణయం అని రజనీకాంత్ పేర్కొన్నారు.

    English summary
    Rajinikanth U turn on Political entry. Rajinikanth announces that he is not going to foray into politics citing his health condition. I have decided not to enter politics... I request all my fans and people of Tamil Nadu to accept my decision
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X