ఇక ...రజనీకాంత్ స్జేజీ నాటకాలు
హైదరాబాద్: ఇప్పటి వరకు వెండితెరపై అభిమానులకు వినోదాన్ని పంచిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ త్వరలో స్టేజ్ నాటకంలో నటించబోతున్నారు. ప్రముఖ తమిళ రంగస్థల నటుడు, రచయిత, రజనీకాంత్ తోడల్లుడు వైజీ మహేంద్రన్ ఈ మేరకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. రజనీని దృష్టిలో పెట్టుకుని ఆయన ఓ నాటకం రాస్తున్నాడట.
ఇటీవల రజనీని కలసి, ఆయన కోసం నాటకం రాస్తున్నాననీ అందులో నటించాలనీ కోరాను. ఈ విషయంపై త్వరలోనే మళ్లీ ఆయనని కలుస్తాను. నా మాట ఆయన కాదనరనే నమ్మకం వుందంటూ ఏకంగా మీడియా ప్రకటన కూడా ఇచ్చేసారు వైజీ మహేంద్రన్. మరి రజనీకాంత్ ఎలా స్పందిస్తారో చూడాలి.

ప్రస్తుతం రజనీకాంత్ ‘లింగా' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో రజనికి జోడిగా అందాల భామలు అనుష్క, సోనాక్షి సిన్హా నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు కెఎస్. రవి కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. రాక్‌లైన్ వెంకటేష్ నిర్మాతగా రాక్‌లైన్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సౌత్ ఇండియాలో అత్యంత భారీగా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి రత్నవేలు సినిమాటోగ్రఫీ, ఏ.అర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.
తాజాగా వినాయక చవితి పురస్కరించుకుని విడుదలైన ఈచిత్రం ఫస్ట్‌లుక్‌కి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌కి తొలిరోజు 50 లక్షల హిట్స్ వచ్చాయి. ఆడియోని దీపావళికి రిలీజ్ చేసి సినిమాని రజనికాంత్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











