»   »  రజనీకాంత్ ‘రోబో 2.0’ ప్రీ లుక్...ఇదే

రజనీకాంత్ ‘రోబో 2.0’ ప్రీ లుక్...ఇదే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా భారీ చిత్రాల దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం '2.0'. ఈ చిత్రం అఫీషియల్ ఫస్ట్ లుక్ నవంబర్ 20న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం ముంబైలో గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు.

తాజాగా... 2.0 చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్ రజనీకాంత్‌ ట్విట్టర్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రంలో అమీ జాక్సన్‌ కథానాయికగా నటిస్తుండగా బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్‌ విలన్ పాత్రలో పోషిస్తున్నారు.

ఇదే ప్రీ లుక్ పోస్టర్

ఇదే ప్రీ లుక్ పోస్టర్

రజనీకాంత్ ట్విట్టర్లో పోస్టు చేసిన 2.0 పోస్టర్ ఇదే. సాధారణంగా సినిమా పోస్టర్లపై విలన్ల పేర్లను ప్రస్తావించరు. కానీ ఈ పోస్టర్లో రజనీతో పాటు అక్షయ్‌కుమార్‌ పేరు కూడా ప్రస్తావించడం గమనార్హం.

 ముంబైలో గ్రాండ్ ఈవెంట్

ముంబైలో గ్రాండ్ ఈవెంట్

‘2.0' ఫస్ట్‌లుక్‌ విడుదల కార్యక్రమం ఈ నెల 20న ముంబయిలోని యశ్‌రాజ్‌ స్టూడియోస్‌ లో జరుగబోతోంది. ఈ మేరకు ఏర్పాట్లు గ్రాండ్ గా చేస్తున్నారు.

 నేషనల్ వైడ్ హైప్ తెచ్చేందుకే

నేషనల్ వైడ్ హైప్ తెచ్చేందుకే

ముంబైలో ఫస్ట్ లుక్ కార్యక్రమం ఏర్పాటు చేయడం వెనక ముఖ్య కారణం సినిమాకు నేషనల్ వైడ్ హైప్ తేవడమే. చెన్నైలో చేస్తే అది సౌత్ సినిమా కింద ముద్ర పడుతుందని, ముంబైలో చేస్తే నేషనల్ వైడ్ హైప్ వస్తుందని భావిస్తున్నారు.

కరణ్ జోహర్

కరణ్ జోహర్

ఈ కార్యక్రమానికి రజనీకాంత్‌, అమీ జాక్సన్‌, శంకర్‌, అక్షయ్‌కుమార్‌, నిర్మాత సుభాష్‌ కరణ్‌, సంగీత దర్శకుడు ఎ.ఆర్‌.రెహమాన్‌ తదితర చిత్ర బృందం హాజరుకానుంది. బాలీవుడ్‌ దర్శక-నిర్మాత కరణ్‌జోహార్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారు.

English summary
Karan Johar will be releasing the first look of superstar Rajinikanth's much-anticipated 2.0 in Mumbai.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu