Rajini Vs Mahesh సంక్రాంతి బరిలో 10 సినిమాలు.. గుంటూరు కారంతో లాల్ సలామ్ పోటీ.. రజనీ, మహేష్ నువ్వా నేనా!
తెలుగు సినిమా పరిశ్రమలో 2024 సంక్రాంతి పండుగ రసవత్తరంగా మారనున్నది. దక్షిణాదిలో ముఖ్యంగా అగ్ర హీరోల మధ్య భారీ పోటీ నెలకొన్నది. అరడజనుకుపైగా భారీ చిత్రాలు నువ్వా నేనా అనే విధంగా సంక్రాంతి బరిలో దిగేందుకు ప్లాన్ చేసుకొన్నాయి. దక్షిణాదిలో అగ్ర హీరోల సినిమాలు ఏవి సంక్రాంతి బరిలో ఉన్నాయి? ఏ హీరోలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారనే విషయంలోకి వెళితే..
టాలీవుడ్‌లో సంక్రాంతి బరిలో ఏడు సినిమాలు నిలిచేందుకు సిద్దమవుతున్నాయి. వాటిలో మహేష్ బాబు నటించిన గుంటూరు కారం, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తున్న హనుమాన్, విజయ్ దేవరకొండ, పరుశురాం కాంబినేషన్‌లో వస్తున్న VD13, రవితేజ నటించిన ఈగల్, వెంకటేష్ నటించిన సైంధవ్, నాగార్జున నటించిన నా సామి రంగ సినిమాలు సంక్రాంతికి రిలీజ్ ప్లాను చేసుకొంటున్నాయి.

ఇక తమిళంలో పొంగల్ బరిలో భారీ చిత్రాలు రంగంలోకి దూకనున్నాయి. రజనీకాంత్ హీరోగా ఆయన కూతురు దర్శకత్వం వహిస్తున్న లాల్ సలామ్ సినిమా సంక్రాంతి బరిలో నిలిచే ఉంది. అలాగే శివరాజ్ కుమార్ నటిస్తున్న ఏలియన్ బ్యాక్ డ్రాప్ సినిమా జనవరి రెండోవారంలో రిలీజ్ కానున్నది. అలాగే ప్రముఖ దర్శకుడు సుందర్ సీ దర్శకత్వంలో తమన్నా భాటియా నటించిన అరణ్మనై 2 చిత్రం కూడా సంక్రాంతికి రిలీజ్ కానున్నది.

తమిళంలో రీలీజ్ అవుతున్న మూడు భారీ చిత్రాలు కూడా తెలుగు డబ్బింగ్ చిత్రాలుగా రిలీజ్ కానున్నాయి. దాంతో తెలుగులో ఏడు సినిమాలు రిలీజ్‌కు సిద్దమవుతుండగా.. తమిళ డబ్బింగ్ చిత్రాలు మరో మూడు ఈ రేసులో జాయిన్ కానున్నాయి. దాంతో ఎన్నడూలేని విధంగా 2024 సంక్రాంతి పండుగకు భారీ పోటీ నెలకొని ఉంది.

ఇక సంక్రాంతి బరిలో లాల్ సలామ్, గుంటూరు కారం సినిమాల పోటీ ఆసక్తిగా మారింది. జైలర్ సినిమాతో మంచి ఊపు మీద ఉన్న రజనీకాంత్, అలాగే వరుస సినిమాలతో జోష్ మీద ఉన్న మహేష్ బాబు మధ్య పోటీ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. బాక్సాఫీస్ వద్ద ఏ సినిమా ఎంత వసూలు చేస్తుందనే విషయం చర్చనీయాంశమైంది.

ఇదిలా ఉండగా, సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లాల్ సలామ్ చిత్రంలో విష్ణు విశాల్, విక్రాంత్, జీవితా రాజశేఖర్, క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్ తదితరులు నటించారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్నాయి. ఈ సినిమాను 2024 సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ప్రకటించింది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవల్లో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం అని లైకా ప్రతినిధులు అన్నారు.


Click it and Unblock the Notifications











