3 రోజుల్లోనే ప్రేమలో పడేశా, మధ్యలో బ్రేకప్ అయింది: సుమతో ప్రేమాయణంపై రాజీవ్ కనకాల
Recommended Video
టాలీవుడ్లో ఆదర్శవంతమైన జంటల్లో యాంకర్ సుమ, రాజీవ్ కనకాల టాప్ లిస్టులో ఉంటారు. వీరిది ప్రేమ వివాహం అనే సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాజీవ్ కనకాల మరోసారి తన లవ్ స్టోరీ గుర్తు చేసుకున్నారు. తమ మధ్య పరిచయం ఎలా ఏర్పడింది? ప్రేమ, బ్రేకప్, పెళ్లి విషయలను గుర్తు చేసుకున్నారు.
రాజీవ్ కనకాల తండ్రి దేవదాస్ కనకాల అప్పట్లో పలు సీరియల్స్ తీశారు. ఆయన తీసిన 'మేఘమాల' సీరియల్‌లో సుమ హీరోయిన్‌గా నటించింది. ఇందులో రాజీవ్ కనకాల కూడా చిన్న పాత్ర పోషించారు. అయితే అంతకంటే ముందే వీరి మధ్య పరిచయం ఉందట. సుమను చూసి తొలి చూపులోనే ప్రేమలో పడినట్లు రాజీవ్ కనకాల వెల్లడించారు.

తొలి చూపులోనే ప్రేమలో, నా పెళ్లాం అని ఫిక్స్ అయ్యా
సుమ నాకు పరిచయమైన తర్వాత మేఘమాల, మాధురి, జీవనరాగం లాంటి సీరియల్స్ చేసింది. దీంతో మా మధ్య స్నేహం, సాన్నిహిత్యం ఏర్పడినట్లు రాజీవ్ కనకాల తెలిపారు. అప్పుడే సుమను పెళ్లి చేసుకోవాలని ఫిక్సయ్యాను, అయితే ప్రపోజ్ చేస్తే నో అంటుందని భయపడ్డాను, ఎందుకంటే నేను ప్రేమిస్తున్న విషయం ఆమెకు ముందే తెలిసిపోయింది. అయినా ధైర్యం చేసి ప్రపోజ్ చేసినట్లు తెలిపారు.

మూడు రోజుల్లోనే సుమను పడేశా
సుమకు ప్రపోజ్ చేసిన తర్వాత మూడు రోజుల్లోనే ఆమెను పడేశాను. మూడో రోజు ఆమె నుంచి ప్రేమకు అంగీకారం వచ్చింది. అప్పట్లో అమ్మాయిల విషయంలో నేను చాలా ఫాస్టుగా ఉండేవాడిని, అందరిలా కాకుండా రూటు మార్చి నా స్టైల్‌లో ఆమెను ప్రేమకు ఒప్పించినట్లు రాజీవ్ కనకాల గుర్తు చేసకున్నారు.

ఆరు నెలలకే బ్రేకప్ అయింది
మా మధ్య ప్రేమ మొదలైన తర్వాత ఆరు నెలలకు ఇద్దరి మధ్య కాస్త దూరం పెరిగింది. నేను ఆంక్షలు పెడుతున్నట్లు సుమ ఫీలైంది. అలాంటిది ఏమీ లేదని ఆమెను ఒప్పించడానికి చాలా ప్రయత్నించాను. అయితే నేను నా పనిలో బిజీ అయిపోవడం వల్ల దూరం పెరుగుతూ వచ్చిందని తెలిపారు.

ఆ తర్వాత నెల రోజులకే పెళ్లి జరిగింది
మళ్లీ 1998 చివర్లో ఇద్దరం ఒకరినొకరు అర్థం చేసుకుని దగ్గరయ్యాం. ఇంకా గ్యాప్ ఇస్తే మళ్లీ ఏం జరుగుతుందో అని నెల రోజుల తర్వాత ఫిబ్రవరి 10, 1999 పెళ్లి చేసుకున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు సాఫీగా మా దాంపత్య జీవితం కొనసాగుతున్నట్లు రాజీవ్ కనకాల వెల్లడించారు.


Click it and Unblock the Notifications











