సుమ విషయంలో జోక్యం ఉండదు.. నాకైతే తెలియదు.. రాజీవ్ కనకాల షాకింగ్ కామెంట్స్

యాంకర్ సుమ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని ప్రేక్షకులు ఉండరనడంతో అతిశయోక్తి లేదు. బుల్లితెర యాంకర్‌గా, స్టేజ్ షోలకు హోస్ట్‌గా చేస్తూ భారీ పాపులారిటీ సంపాదించింది సుమ. సందర్బానుసారంగా పంచులేయడంలో సుమను మించిన మరో వ్యక్తి లేరనే చెప్పుకోవాలి. అందుకే యాంకర్ సుమకు అంత క్రేజ్. కాగా తాజాగా ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన సుమ భర్త రాజీవ్ కనకాల ఆమె గురించి, ఆమె కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి పోతే..

సుమ, రాజీవ్ కనకాల ప్రేమ వివాహం.. ఆ తర్వాత

సుమ, రాజీవ్ కనకాల ప్రేమ వివాహం.. ఆ తర్వాత

యాంకర్ సుమ, రాజీవ్ కనకాల ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 10, 1999లో వీరి వివాహం జరిగింది. వీరిద్దరూ అన్యూన్య దాంపత్య జీవితం కొనసాగిస్తూ ఎవరి పనుల్లో వారు బిజీ బిజీగా గడుపుతున్నారు. యాంకర్ గా సుమ, యాక్టర్ గా రాజీవ్ కనకాల ప్రేక్షకులను ఫుల్లుగా ఎంటర్‌టైన్ చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరికి విషయాలు తెలుసుకోవడంలో ఇంట్రెస్ట్ చూపుతున్నారు జనం.

సుమ గురించి రాజీవ్.. ఆమె లోని చలాకీ తనమే

సుమ గురించి రాజీవ్.. ఆమె లోని చలాకీ తనమే

ఇటీవలే జరిగిన ఓ ఇంటర్వ్యూలో సుమ గురించిన కొన్ని విషయాలు ప్రస్తావించారు రాజీవ్ కనకాల. సుమ విజయం వెనక భర్త రాజీవ్ కనకాల సపోర్ట్ ఉందని అంతా భావిస్తుంటారు కానీ, నిజానికి అలాంటిదేమీ లేదని రాజీవ్ పేర్కొన్నారు. ఆమె లోని ప్రతిభ, చలాకీ తనమే ఈ రేంజ్‌లో నిలబెట్టిందని ఆయన చెప్పారు.

సుమ ఈ స్థాయిలో ఉందంటే కారణం

సుమ ఈ స్థాయిలో ఉందంటే కారణం

ఈ రోజు సుమ క్రేజ్, ఆమె పాపులారిటీ చూస్తే సంతోషంగా ఉందని చెప్పిన రాజీవ్.. ఆమె ఈ స్థాయిలో ఉందంటే కాస్తో కూస్తో కారణం మా తండ్రి గారైన దేవదాస్ కనకాల కావొచ్చేమో గానీ తాను మాత్రం కాదని అన్నారు రాజీవ్. దేవదాస్ కనకాల కోడలు కావడం ఆమె కెరీర్‌కి కొంచం అడిషన్ కావొచ్చు. మిగితా అంతా ఆమె కష్టం, ఆమె ప్రతిభనే అని చెప్పారు రాజీవ్ కనకాల.

ఆ విషయంలో అస్సలు జోక్యం చేసుకోను

ఆ విషయంలో అస్సలు జోక్యం చేసుకోను

సుమ ఇంత పాపులారిటీ సంపాదించింది కాబట్టి ఆమె రెమ్మ్యూనరేషన్ ఎంత ఉంటుంది అనే క్యూరియాసిటీ అందరిలోనూ ఉంటుందని, కానీ తాను మాత్రం ఆ విషయంలో అస్సలు జోక్యం చేసుకోనని స్పష్టం చేశారు రాజీవ్. అయితే తానూ సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తుండటం వెనుక నా సపోర్ట్ ఉందని చెప్పడం ఆమె గొప్పతనమని పేర్కొంటూ సుమను ఆకాశానికెత్తారు రాజీవ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X