చూసేవాళ్లకు కూడా నచ్చదు.. ఎన్టీఆర్‌తో గొడవలపై రాజీవ్ కనకాల కామెంట్స్

Recommended Video

Rajiv Kanakala Gives Clarity On Clashes With Jr NTR || Filmibeat Telugu

తెలుగు సినిమా నటీనటుల్లో కొందరి మధ్య స్పెషల్ బాండింగ్ ఉంటుంది. అది హీరోల మధ్య కావచ్చు.. హీరో, క్యారెక్టర్ ఆర్టిస్టు మధ్య కావచ్చు. ఆ స్పెషల్ బాండింగ్ ఆ ఇద్దరు నటుల ఫ్యాన్స్‌కి కన్నుల పండుగగా అనిపిస్తుంటుంది. అయితే కొన్నిసార్లు ఆ బాండింగ్‌లో తేడా వచ్చిందనే వార్తలు వారి వారి ఫ్యాన్స్‌ని తెగ బాధపెట్టేస్తాయి. ఇటీవలి కాలంలో ఎన్టీఆర్- రాజీవ్ కనకాల బాండింగ్ గురించి కూడా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు పుట్టించారు. అయితే తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో వీటిపై క్లారిటీ ఇచ్చారు రాజీవ్ కనకాల.

కెరీర్ ఆరంభం నుంచే

కెరీర్ ఆరంభం నుంచే

నిజానికి ఎన్టీఆర్ తన కెరీర్ ఆరంభం నుంచే రాజీవ్ కనకాలతో ఎంతో స్నేహంగా మెలిగేవారు. స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో బాగా దగ్గరైన వీళ్ళు ఆ తర్వాత జనతాగ్యారేజ్, నాన్నకు ప్రేమతో వంటి చిత్రాల్లో కలిసి నటించారు. అయితే ఈ మధ్యకాలంలో ఈ జోడీ కాస్త దూరం కావడంతో రూమర్లు పుట్టుకొచ్చాయి.

ఎన్టీఆర్- రాజీవ్ కనకాల గొడవ

ఎన్టీఆర్- రాజీవ్ కనకాల గొడవ

ఎన్టీఆర్, రాజీవ్ కనకాల గొడవ పడ్డారని అందుకే వారి మధ్యనున్న స్నేహం చెదిరిపోయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి వార్తలను ఖండిస్తూ ఇదివరకే స్పందించిన రాజీవ్ కనకాల మరోసారి ఇదే విషయమై స్పందించారు. తమ మధ్య ఉన్న బాండింగ్ చెదిరిపోయిందని వస్తున్న వార్తలు నిజం కాదని ఆయన అన్నారు.

2009 ఎన్నికల ప్రచారం తర్వాత

2009 ఎన్నికల ప్రచారం తర్వాత

2009 లో జరిగిన ఎన్నికల ప్రచార నిమిత్తమై జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి రాజీవ్ కనకాల హాజరయ్యారు. ఆ సమయంలో ఎన్టీఆర్ కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఎన్టీఆర్‌తో పాటు రాజీవ్ కూడా గాయపడ్డారు. అయితే ఆ కారు ప్రమాదానికి కారణం రాజీవేనని, అందుకే ఎన్టీఆర్ ఆయనను దూరం పెట్టారని వార్తలు పుట్టుకొచ్చాయి. అందుకే కొంత కాలం రాజీవ్‌తో ఎన్టీఆర్ కట్ చేసుకున్నారని చెప్పుకొచ్చారు.

రాజీవ్ క్లారిటీ.. దూరం కావాలనుకుంటే ఆపగలనా?

రాజీవ్ క్లారిటీ.. దూరం కావాలనుకుంటే ఆపగలనా?

తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో ఈ ఇష్యూపై రాజీవ్ స్పందించారు. తాను ఎవ్వరినీ దూరం చేసుకోనని, ఒకవేళ దూరం కావాలనుకుంటే ఆపలేనని అన్నారు. ఈ మేరకు ఎన్టీఆర్‌తో స్నేహం చెదిరిపోవడమనేది అవాస్తవమని, ఆయన చేసిన ప్రతీ సినిమాలో నటించడం ఎలా సాధ్యపడుతుందని ఆయన ప్రశ్నించారు.

 చూసేవాళ్లకు నచ్చుతుందా..?

చూసేవాళ్లకు నచ్చుతుందా..?

మా ఇద్దరి మధ్య ఎంత బాండింగ్ ఉంటే మాత్రం ఎన్టీఆర్ చేసిన ప్రతీ సినిమాలో నటిస్తే చూసే వాళ్లకు ఎలా నచ్చుతుందని రాజీవ్ అన్నారు. ఎన్టీఆర్ చాలా ఓపెన్ మైండెడ్ పర్సన్, చాలా మంచి మనిషి. నన్నెప్పటికీ మర్చిపోనని స్టూడెంట్ నెంబర్ 1 సమయంలోనే మాటిచ్చారు. మా మధ్య బాండింగ్ ఎప్పటికీ అలాగే ఉంటుందని రాజీవ్ చెప్పుకొచ్చారు.

ఆర్ఆర్ఆర్

ఆర్ఆర్ఆర్

ఇటీవలే అరవింద సమేత చిత్రంలో మంచి విజయం సొంతం చేసుకున్న ఎన్టీఆర్.. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ నటిస్తుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. 2020 జులై నెలలో ఆర్ఆర్ఆర్ విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X