twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షూటింగ్‌లో రైలు ప్రమాదం.. నేను, తారక్ చనిపోయే వాళ్లం: షాకింగ్ సీక్రెట్ రివీల్ చేసిన రాజీవ్ కనకాల

    By Manoj Kumar P
    |

    రాజీవ్ కనకాల.. తెలుగు సినీ ఇండస్ట్రీలోని చెప్పుకోదగ్గ యాక్టర్లలో ప్రప్రథమంగా వినిపించే పేరిది. చిరంజీవి, రజినీకాంత్ సహా ఎంతో మందికి నటనలో మెళకువలు నేర్పిన సీనియర్ యాక్టర్ దేవదాస్ కనకాల కుమారుడిగా సినిమాల్లోకి ప్రవేశించాడు రాజీవ్. కెరీర్ ఆరంభంలో చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన ఈయన.. ఆ తర్వాత మెయిన్ విలన్‌గానూ మెప్పించాడు. అలాగే, హీరోగానూ నటించాడు. తాజా ఇంటర్వ్యూలో ఓ సినిమా షూటింగ్ జరిగేప్పుడు స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌, తాను చనిపోయే వాళ్లమని ఓ షాకింగ్ సీక్రెట్‌ను రివీల్ చేశాడాయన. వివరాల్లోకి వెళితే....

    మరిచిపోలేని పాత్రలతో మెప్పించాడు

    మరిచిపోలేని పాత్రలతో మెప్పించాడు

    రాజీవ్ కనకాల 1996లో వచ్చిన ‘వెల్‌కమ్ బ్యాక్' అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఎన్నో చిత్రాల్లో నటించాడు. వాటిలో చాలా సినిమాల్లో అద్భుతమైన నటనను కనబరిచాడు. ఈ క్రమంలోనే పలు అవార్డులను సైతం తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో అతడి పాపులారిటీ బాగా పెరిగిపోయింది.

    జూనియర్ ఎన్టీఆర్‌తో ప్రత్యేక అనుబంధం

    జూనియర్ ఎన్టీఆర్‌తో ప్రత్యేక అనుబంధం

    ‘స్టూడెంట్ నెం1' అనే సినిమా ద్వారా జూనియర్ ఎన్టీఆర్, రాజీవ్ కనకాల తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఆ తర్వాత వీళ్ల కాంబోలో ‘ఆది', ‘నాగ', ‘అశోక్', ‘యమదొంగ', ‘బాద్‌షా', ‘నాన్నకు ప్రేమతో', ‘జనతా గ్యారేజ్' వంటి చిత్రాలు వచ్చాయి. ఈ సినిమాలు జరుగుతున్న సమయంలోనే ఈ ఇద్దరు నటుల మధ్య స్నేహం కూడా బాగా పెరిగిపోయింది.

    ప్రచారం.. ప్రమాదం సమయంలో తారక్‌తో

    ప్రచారం.. ప్రమాదం సమయంలో తారక్‌తో

    రాజీవ్ కనకాల - ఎన్టీఆర్ బాగా క్లోజ్‌గా ఉన్న సమయంలోనే 2009లో ఎన్నికలు వచ్చాయి. అప్పుడు తారక్ తన తాత స్థాపించిన పార్టీ కోసం ఆంధ్రప్రదేశ్‌లో ప్రచారం నిర్వహించాడు. ఆ సమయంలో రాజీవ్ కూడా అతడి పక్కనే ఉన్నాడు. అంతేకాదు, ప్రచారం ముగించుకుని వస్తున్న సమయంలో ఎన్టీఆర్‌కు ప్రమాదం జరిగినప్పుడు కూడా ఆ కారులోనే ప్రయాణించాడాయన.

    ఎన్టీఆర్‌తో విభేదాలు.. క్లారిటీ ఇచ్చాడు

    ఎన్టీఆర్‌తో విభేదాలు.. క్లారిటీ ఇచ్చాడు

    ‘అశోక్' సినిమా తర్వాత రాజీవ్ - తారక్ చాలా కాలం కలిసి నటించలేదు. దీంతో ఈ ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయని అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. దీనిపై రాజీవ్ స్వయంగా స్పందించాడు. ‘ఎన్టీఆర్‌తో నాకు చెడిందని వచ్చిన వార్తలు అవాస్తవం. అసలు మాకు మధ్య గ్యాప్ ఎప్పుడూ లేదు. అదే నిజమైతే ‘జనతా గ్యారేజ్', ‘నాన్నకు ప్రేమతో' ఎందుకు చేస్తా' అని వ్యాఖ్యానించాడు.

    రైలు ప్రమాదంలో నేను, తారక్ చనిపోయే వాళ్లం

    రైలు ప్రమాదంలో నేను, తారక్ చనిపోయే వాళ్లం

    తాజాగా రాజీవ్ కనకాల ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఓ షాకింగ్ న్యూస్ రివీల్ చేశారు. ‘నాగ సినిమా షూటింగ్ క్లైమాక్స్‌లో రైలుపై నేను, తారక్ ఫైట్ చేయాలి. మేము పైన ఉన్న టైమ్‌లో రైలు కదిలింది. దీంతో మేమిద్దరం కింద పడిపోయేవాళ్లం. అప్పుడు ఏదో అందితే పట్టుకున్నాం. లేకుంటే ఇద్దరం చనిపోయే వాళ్లం' అని ఆయన చెప్పుకొచ్చారు.

    ఏదో అనుకుంటే ఇంకేదో అయిపోయింది

    ఏదో అనుకుంటే ఇంకేదో అయిపోయింది

    జూనియర్ ఎన్టీఆర్ హీరోగా డీకే సురేష్ తెరకెక్కించిన చిత్రం ‘నాగ'. సదా, జెన్నీఫర్, రఘువరన్, రాజీవ్ కనకాల సహా ఎంతో మంది ప్రముఖులు నటించిన ఈ మూవీని ఏఎమ్ రత్నం నిర్మించారు. 2003 సంక్రాంతి కానుకగా ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టింది. అయితే, పొలిటికల్ టచ్ ఉన్న పాత్రలో ఎన్టీఆర్ మెప్పించాడు.

    English summary
    Rajeev Kanakala is a Telugu and Kannada film and television actor. He started his career in television serials and short films, where he not only acted but also produced and directed. He is married to Suma Kanakala, also an actress and TV anchor.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X