ఆ మహా నటుడి విగ్రహానికి నిప్పు పెట్టారు
హైదరాబాద్: కన్నడ మహా నటుడు, దివంగత డాక్టర్ రాజ్ కుమార్ విగ్రహానికి తీవ్రమైన అవమానం జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఆయన విగ్రహానికి నిప్పు పెట్టి ధ్వంసం చేసారు. నవంబర్ 13న బంగలూరులోని బంగారప్ప లేఔట్ రాజేశ్వరి నగర్లో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. విగ్రహంపై కిరోసిన్, పేపర్లు వేసి నిప్పంటించారు. నవంబర్ 23న ఈ విగ్రహం ఆవిష్కరణ జరుగాల్సి ఉంది. ఈలోపే ఎవరో ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు.
ఈ కేసును పోలీసులు సుమోటోగా స్వీకరించారు. రాజేశ్వరి నగర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ ఘటనపై రాజ్ కుమార్ తనయుడు రాఘవేంద్ర రాజ్ కుమార్ మాట్లాడుతూ...ఈ సంఘటనతో తమ కుటుంబం తీవ్ర మనోవేదనకు గురైందని తెలిపారు. బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు.

‘ఇలా ఎందుకు చేసారు అర్థం కావడం లేదు. ఈ నెల 23న విగ్రహాన్ని ఆశిష్కరించాలని ప్లాన్ చేసాం. రాజ్ కుమార్ గారి పేరుతో మెమోరియల్ ట్రస్టు కూడా ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేసాం. ఎవరో కావాలని మాపై జలసీతో ఈ చర్యకు పాల్పడ్డారని భావిస్తున్నాం. ఇలాంటి దుశ్చర్యల వల్ల సాధించేది ఏమీ లేదు' అన్నారు రాఘవేంద్ర రాజ్ కుమార్.
మరో వైపు రాజ్ కుమార్ విగ్రహానికి నిప్పు పెట్టడం కన్నడ సినీ పరిశ్రమ మొత్తం భగ్గుంది. ప్రముఖలంతా ఈ చర్యను ఖడించారు.


Click it and Unblock the Notifications











