twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘పికె’ వివాదం : అన్ని మతాలను గౌరవిస్తాం

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ‘పికె' చిత్రం విడుదలైనప్పటి నుండి వివాదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పలు హిందూ సంస్థలతో పాటు, ముస్లిం సంస్థలు కూడా ఈ చిత్రంలోని సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. హిందూ దేవతలను కించ పరిచే విధంగా సినిమాలోని సన్నివేశాలు ఉన్నాయంటూ కేసులు కూడా నమోదయ్యాయి.

    హిందూ సంస్థలే కాదు, పలు ముస్లిం సంస్థలు కూడా ‘పికె' సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. పికె సినిమాను నిషేదించాలని, పికె సినిమాతో సంబంధం ఉన్న వారిని సమాజం నుండి వెలివేయాలని బాబారాందేవ్ చేసిన ప్రకటనకు అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డ్ కూడా మద్దతు ప్రకటించింది.

    Rajkumar Hirani Says PK Not Disrespectful To Any Religion

    మరో వైపు భజరంగ్ దళ్ సభ్యులు ‘పికె' సినిమా ప్రదర్శితం అవుతున్న థియేటర్లపై దాడులు చేసారు. ఈ వివాదాల నేపథ్యంలో......దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ ప్రకటన చేసారు. ఎవరినీ కించపరిచే ఉద్దేశ్యం తమకు లేదని, తాము అన్ని మతాలను, మత విశ్వాసాలను గౌరవిస్తామని తెలిపారు. అమీర్ ఖాన్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు.

    కాగా....సినిమాను ప్రదర్శన కొనసాగుతుందని, ఎలాంటి సీన్లు తొలగించాల్సిన అవసరం లేదని సెంట్రల్ సెన్సార్ బోర్డు స్పష్టం చేసింది. సినిమా ఎవరినీ కించ పరిచే విధంగా లేదన్నారు. ఎలాంటి సీన్లు తొలగించడానికి బోర్డు సిద్దంగా లేదని కేంద్ర సెన్సార్ బోర్డు చైర్ పర్సన్ లీలీ శాంసన్ చెప్పారు.

    English summary
    Rajkumar Hirani said there was no intention to hurt anyone through PK.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X