రాజ్‌కుమార్ మెమోరియల్ ఈవెంటులో చిరు, రజనీ (ఫోటోస్)
హైదరాబాద్: ప్రముఖ కన్నడ నటుడు రాజ్ కుమార్ స్మారక మందిరం ప్రారంభోత్సవం శనివారం బెంగులూరులో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కర్నాటక ముఖ్యమంత్రి సిద్ద రామయ్యతో పాటు సౌతిండియా స్టార్స్ రజనీకాంత్, చిరంజీవి, అంబరీష్, నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ పలువురు ఇతర నటీనటులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ సినీ రంగానికి రాజ్ కుమార్ చేసిన సేవలను కొనియాడారు. సినీ పరిశ్రమ అభివృద్ధి లో రాజ్ కుమార్ తన వంతు పాత్ర పోషించారని అన్నారు. ఆయన లేని లోటు తీరనిది అని అన్నారు. ఈ రోజు సాయంత్రం బెంగుళూరులో రాజ్ కుమార్ స్మాకరకంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
రాజ్ కుమార్ స్మాకర మందిరం ప్రారంభోత్సవానికి సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో.

హాజరైన స్టార్స్
రాజ్ కుమార్ స్మాకర మందిరం ప్రారంభోత్సవానికి హాజరైన సౌతిండియా స్టార్స్ రజనీకాంత్, చిరంజీవి, అంబరీష్ తదితరులు.

ముఖ్యమంత్రి
కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేతుల మీదుగా ఈ స్మారక మందిరం ప్రారంభోత్సవం జరిగింది.

ఎనలేని సేవ
రాజ్ కుమార్ కన్నడ సినీ రంగానికి ఎనలేని సేవ చేసారని పలువురు వక్తలు కొనియాడారు.

పూల వాన
రాజ్ కుమార్ సమాదిపై పూల వాన కురిపిస్తున్న కర్నాటక సీఎం సిద్ధ రామయ్య.

రాజ్ కుమార్
రాజ్ కుమార్ స్మారక మందిరాన్ని ఎంతో ప్రత్యేకంగా తీర్చి దిద్దారు.


Click it and Unblock the Notifications











