twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డబ్బులు నీళ్లలా.... రోబో 2.0 ఆడియో వేడుక ఖర్చు తెలిస్తే షాకవుతారు!

    రజనీకాంత్ రోబో 2.0 ఆడియో వేడుక డేట్ ఫిక్స్ అయింది. ఈ నెల 27న దుబాయ్ లో వేడుక జరుగనుంది.

    By Bojja Kumar
    |

    Recommended Video

    Rajinikanth's Robo 2.0 Audio Launch Date Is Out ఖర్చు తెలిస్తే షాకవుతారు!

    ఇండియాలో ఇప్పటి వరకు భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా ఏది అంటే అందరూ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'బాహుబలి' పేరే చెబుతారు. అయితే త్వరలోనే ఈ అభిప్రాయం మారిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. బాహుబలి ప్రాజెక్టును మించిన సినిమాగా రజనీకాంత్ రోబో 2.0 సినిమా అవతరించేలా ఉంది.

    దాదాపు రూ. 400 కోట్ల పైచిలుకు బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రమోట్ చేయడానికి కూడా భారీగానే ఖర్చు చేస్తున్నారు. గతేడాది నంబర్లో 2.0 సినిమా లాంచింగ్ కార్యక్రమం ముంబైలో గ్రాండ్ గా నిర్వహించిన సంగతి తెలిసిందే. దేశంలోని మీడియా సంస్థలను, విదేశీ మీడియా సంస్థలను సైతం ఆహ్వానించి రూ. 6 కోట్లు ఖర్చు పెట్టి లాంచింగ్ ఘనంగా నిర్వహించారు.

    దుబాయ్‌లో ఆడియో వేడుక

    దుబాయ్‌లో ఆడియో వేడుక

    రోబో 2.0 సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. సినిమా ప్రమోషన్లో భాగంగా ఆడియో రిలీజ్ వేడుక ఈనెల 27న దుబాయ్‌లో గ్రాండ్ గా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. యావత్ ప్రపంచం దృష్టి తమ సినిమాపై పడేలా దుబాయ్‌లో ఈ వేడుక నిర్వహించబోతున్నారు.

    డబ్బులు నీళ్లలా ఖర్చు...

    డబ్బులు నీళ్లలా ఖర్చు...

    రోబో 2.0 ఆడియో వేడుక కోసం డబ్బులు నీళ్లలా ఖర్చు పెడుతున్నారు. ఈవెంటును రూ. 12 కోట్ల ఖర్చుతో నిర్వహించబోతున్నట్లు సమాచారం. ఇంత భారీ ఎత్తున నిర్వహించడం వెనక భారీ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఉన్నాయని తెలుస్తోంది.

    ఇండియన్ బిగ్ 3డి ఫిల్మ్

    ఇండియన్ బిగ్ 3డి ఫిల్మ్

    3డి ఎఫెక్టులతో ఈ సినిమా ఇండియన్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి కలిగించనుంది. ఇండియాలో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న 3డి సినిమా ఇది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి త్రీడీ మేకింగ్ వీడియోను విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది.

    3డి ఎఫెక్టుకు సూటయ్యేలా స్క్రిప్టు సిద్ధం చేసిన శంకర్

    3డి ఎఫెక్టుకు సూటయ్యేలా స్క్రిప్టు సిద్ధం చేసిన శంకర్

    దర్శకుడు శంకర్ మాట్లాడుతూ... "ఏదో పేరు కోసం 3డిలో ఈ సినిమా చేయలేదు. ఈ సినిమా స్క్రిప్ట్‌కు 3డి టెక్నాలజీ అవసరం అయింది. దానికి తగిన విధంగా స్క్రిప్టును సిద్ధం చేయడం జరిగింది. హాలీవుడ్ ఫిల్మ్స్ లో చాలా వరకు 2డి షూట్ చేసి ఆ తర్వాత వాటిని పోస్టు ప్రొడక్షన్ లో 3డిలోకి మార్చుతారు. కానీ ఈ సినిమాని నేరుగా లేటెస్ట్ 3డి కెమెరాతోనే షూట్ చేశాం. 3డిలో మనం క్రియేట్ చేసే డెప్త్ అద్భుతంగా ఉంటుంది. నేను మానిటర్లో షాట్ చూస్తున్నపుడు, నేను అక్కడే ఉన్నట్లుగా, అక్కడే కథ జరుగుతున్నట్లుగా ఫీల్ అయ్యాను. ఈ సినిమా చాలా మంది ప్రొడ్యూసర్స్ ను 3డిలో సినిమా తీయాలనేలా ప్రోత్సహిస్తుంది. చాలా థియేటర్స్ 3డి థియేటర్స్‌గా మారతాయనుకుంటున్నాను." అన్నారు.

    ఔట్ పుట్ మీద రజనీకాంత్ హ్యాపీ

    ఔట్ పుట్ మీద రజనీకాంత్ హ్యాపీ

    రజనీకాంత్ మాట్లాడుతూ... శంకర్ 3డిని దృష్టిలో ఉంచుకుని ఈ స్క్రిప్టు రాశారు. ఫస్ట్ 3డి షాట్ నేను చిన్న స్క్రీన్ లో చూశాను. నేను మళ్లీ మళ్లీ ఎన్ని సార్లు చూశానో నాకే తెలియదు. అంతలా అది నన్ను మెస్మరైజ్ చేసింది. నేను ఆడియన్స్ రియాక్షన్ చూడాలని వెయిట్ చేస్తున్నాను. ఇది ఒక పెద్ద హాలీవుడ్ 3డి మూవీ స్థాయిలో ఉంటుంది అన్నారు.

    అరుదైన అనుభవం

    అరుదైన అనుభవం

    అక్షయ్ కుమార్ మాట్లాడుతూ... 3డిలో పని చేయడం నేను అనుకున్న దానికంటే చాలా కష్టం. ప్రతి షాట్ లో సెటప్ నుండి అన్నీ పర్ ఫెక్టుగా ఉండేలా చూసుకోవాలి. ప్రతి షాట్ తర్వాత నేను వెనక్కి వెళ్లి, డైరెక్టర్ తో పాటు కూర్చుని హైటెక్ 3డి గ్లాసులతో షాట్ చెక్ చేశాను. ఇండియాలో 3డికి అయితే ఇది అరుదైన అనుభవం. ఆ ఎగ్జైట్మెంట్ పది రెట్లు ఉంటుంది. అన్నారు.

    రిలీజ్ డేట్ ఖరారు

    ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్‌ క్రియేటివ్‌ హెడ్‌ రాజు మహాలింగం మాట్లాడుతూ - ''రజనీకాంత్‌గారితో శంకర్‌గారు చేస్తున్న మరో అద్భుతమైన చిత్రమిది. ఈనెల 27న దుబాయ్‌లో ఈ చిత్రం ఆడియోను చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ చేయబోతున్నాం. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. జనవరి 25న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్‌ చేశాం'' అన్నారు.

    English summary
    The end of October will see the biggest music launch for probably one of the most expensive Indian films. The event for Shankar’s 2.0 is set to take place in Dubai. We are being told that the total billing of the entire event is touching Rs 12 crore itself. 2.0 — a sequel to Shankar’s film Robot is being billed as a Rs 400 crore film making it bigger than the films in the Baahubali series as well.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X