రూ. 5 కోట్ల వివాదం, కమెడియన్‌కి 10 రోజుల పోలీస్ కస్టడీ
న్యూఢిల్లీ: బాలీవుడ్ హాస్య నటుడు రాజ్ పాల్ యాదవ్‌ను 10 రోజుల పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీ హైకోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రూ. 5 కోట్ల రికవరీకి సంబంధించి రాజ్ పాల్ యాదవ్, అతని భార్యకు వ్యతిరేకంగా దావా దాఖలైన నేపథ్యంలో కోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీకి చెందిన పారిశ్రామిక వేత్త ఈ దావా దాఖలు చేసారు.
ఈ కేసుకు సంబంధించిన అతని భార్యకు కూడా జుడీషియల్ కస్టడీ విధిస్తూ రిజిస్టర్ జనరల్ ఆఫీసుకు ఆమెను తరలించాల్సిందిగా జస్టిస్ ఎస్.మురళిధర్ ఆధేశించారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. విచారణ అనంతరం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

రాజ్ పాల్ యాదవ్, అతని భార్యకు ప్రతినిధులుగా ఉన్న ఇద్దరు లాయర్లకు జడ్జి కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసారు.


Click it and Unblock the Notifications