రాజుగారి గది2 ప్రీ రివ్యూ: హైలెట్‌గా కామెడీ, సెంటిమెంట్!!

అక్కినేని నాగార్జున తొలిసారి సస్పెన్స్, హారర్ థ్రిలర్ చిత్రంలో నటిస్తున్నారనగానే రాజుగారిగది2 చిత్రంపై ఆసక్తి నెలకొన్నది.

By Rajababu

అక్కినేని నాగార్జున తొలిసారి సస్పెన్స్, హారర్ థ్రిలర్ చిత్రంలో నటిస్తున్నారనగానే రాజుగారిగది2 చిత్రంపై ఆసక్తి నెలకొన్నది. నాగచైతన్యతో పెళ్లికి ముందు నాగార్జునతో నటిస్తున్నారనగానే ఈ చిత్రంపై మరింత క్రేజ్ పెరిగింది. రాజుగారిగది చిత్రానికి సీక్వెల్ అంటూ వచ్చిన వార్తల్లో వాస్తవం లేదు అనిచెప్పడంతో కథ కొత్తగా ఉంటుందేమో అనే ఉత్సాహం పెరిగింది ప్రేక్షకుల్లో. అయితే ఈ చిత్రం అన్ని హంగులు పూర్తి చేసుకొని అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఈ నేపథ్యంలో రాజుగారి గది2 చిత్ర విశేషాలను తెలుసుకొందాం..

రాజుగారి గది2 కథ..

రాజుగారి గది2 కథ..

రాజుగారిగది2 చిత్ర కథ గోవా నేపథ్యంగా సాగుతుందట. విహారయాత్రకు వెళ్లిన ఓ స్నేహితుల బృందం సముద్ర తీరానికి దగ్గరలో ఉన్న గదిలో దిగుతారట. అందులో జరిగిన విచిత్ర సంఘటనలు ఏమిటనేది ఈ చిత్ర కథ. ఈ కథలో నాగార్జున మెంటలిస్ట్‌గా నటిస్తున్నారు.ఉద్వేగభరితంగా ఉండే సమంత పాత్రను తెరపైన చూడాల్సిందే. నాగార్జున, ఆత్మకు ఉండే లింకు ఏమిటనేది ఈ చిత్రకథలో ఆసక్తిని కలిగించే అంశం.

కామెడీ, హారర్ అంశాలు

కామెడీ, హారర్ అంశాలు

ఓ సినిమా హిట్ అయ్యేందుకు కావాల్సిన కామెడీ, హారర్ అంశాలు ఈ చిత్రంలో బాగా పండాయి అనేది చిత్ర యూనిట్ మొదటి నుంచి బలంగా చెప్తున్న అంశం. రాజుగారి గది2 కోసం ముంబైలో చేయించిన గ్రాఫిక్స్ అదిరిపోయేలా ఉన్నాయి అని గత ఇంటర్వ్యూలో నాగార్జున వెల్లడించడంతో మరింత అంచనాలు పెరిగాయి.

కామెడిగా సాగుతూ..

కామెడిగా సాగుతూ..

నాగార్జున ఎంట్రీలో సినిమా మరో మలుపు తిరుగుతుంది. కామెడిగా సాగే ఈ చిత్రం ఎమోషనల్‌గా మారుతుందట. ఇంటర్వెల్ బ్యాంగ్ ఆసక్తికరంగా ఉంటుంది అని ఇన్‌సైడ్ టాక్. కథ ఆసక్తికరంగా సాగడానికి సాంకేతిక అంశాలు బలంగా మారాయి అనేది మరో కీలక అంశం.

కామెడీ హైలెట్‌

కామెడీ హైలెట్‌

వెన్నెల కిషోర్, షకలక శంకర్, దర్శకుడు ఓంకార్ సోదరుడు అశ్విన్ పాత్రలు చేసే కామెడీ ఈ చిత్రంలో ఓ హైలెట్‌గా నిలుస్తాయని చెబుతున్నారు. ఈ చిత్రంలో సాంకేతిక విభాగాల పనితీరు మరో అదనపు ఆకర్షణ అని చెబుతున్నారు.

ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకునే

ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకునే

ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకోవడానికి సెంటిమెంట్‌ను బాగా దట్టించినట్టు ప్రచారం జరుగుతున్నది. సమంత చేసిన ఆత్మ పాత్ర కుటుంబ తరహా ప్రేక్షకుల హృదయాలను కట్టిపడేయడం ఖాయమంటున్నారు.

 ఫిదా కావడం తథ్యమట

ఫిదా కావడం తథ్యమట

ఆత్మ పాత్రలో సమంత నటనకు ప్రేక్షకులు ఫిదా కావడం తథ్యం అంటున్నారు. సమంత నటన ఈ సినిమా మరో స్థాయికి వెళ్తుంది. సమంత కాకుండా మరొకరు ఊహించలేం అనే మాటను దర్శకుడు ఓంకార్ వెల్లడించడం సినిమాపై ఆయనకు ఉన్న కాన్ఫిడెన్స్‌ను తెలియజేస్తుంది.

టేకింగ్ తెర మీద

టేకింగ్ తెర మీద

డైరెక్టర్ ఓంకార్ పరిణతితో కూడిన దర్శకుడిగా ఈ సినిమాలో కనిపిస్తాడట. ఆయన టేకింగ్ తెర మీద అద్భుతంగా ఉంటుందట. ఓంకార్ కెరీర్‌లో రాజుగారిగది2 చిత్రం మరో హిట్‌గా నిలువడం ఖాయమట.

కొత్తగా రీరికార్డింగ్

కొత్తగా రీరికార్డింగ్

థమన్ అందించిన పాటలు, రీరికార్డింగ్ కొత్తగా ఉండటమే కాకుండా ప్రేక్షకులు సినిమాలో లీనం కావడానికి తోడ్పాటునందిస్తాయి అని నాగార్జున ఇటీవల మీడియా సమావేశంలో చెప్పడం గమనార్హం.

రాజుగారి గది2 హిట్

రాజుగారి గది2 హిట్

రాజుగారి గది2 చిత్ర ఫస్ట్‌లుక్, టీజర్లు, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో రాజుగారి గది2 హిట్ కావడం అనే భావన ప్రేక్షకుల్లో పెరిగింది. దర్శకుడు ఓంకార్ రూపొందించిన గత చిత్రంలో హంగులు, ఆర్బాటాలు ఎక్కువగా ఉన్నాయి అనే మాట సినీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X