నాగార్జున ‘రాజుగారి గది 2’ టైటిల్ లోగో ఇదే, ఫస్ట్ లుక్ 29న
రాజుగారి గది 2 టైటిల్ లోగో రిలీజైంది. సినిమా ఫస్ట్ లుక్ ఆగస్టు 29న రిలీజ్ చేయనున్నారు.
అక్కినేని నాగార్జున ప్రధానపాత్రలో నటిస్తోన్న 'రాజుగారి గది-2' సినిమా టైటిల్ లోగో వినాయక చవితి సందర్భంగా రిలీజ్ చేశారు. ఫస్ట్‌లుక్ పోస్టర్ ఈ నెల 29న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
గతంలో ఓంకార్ దర్శకత్వంలో వచ్చిన హారర్ కామెడీ 'రాజు గారి గది' మూవీ మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. 'రాజు గారి గది 2' అనేది దానికి సీక్వెల్ కాక పోయినా.... అలాంటి కాన్సెప్టుతోనే తెరకెక్కిస్తున్నారు.
పీవీపీ సినిమా, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ఓంకార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో సమంత, సీరత్ కపూర్, వెన్నెలకిషోర్, అశ్విన్ కీలకపాత్రల్లో నటించారు.


Click it and Unblock the Notifications











