దుమ్ము రేపుతున్న రాజుగారి గది కలెక్షన్లు.. కుమ్మేస్తున్న మామా, కోడలు
Recommended Video

నాగార్జున, సమంత నటించిన రాజుగారి గది చిత్రం అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి తొలి రోజే ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన వ్యక్తమవుతున్నది. నాగచైతన్యతో వివాహం తర్వాత సమంత నటించిన చిత్రం విడుదలైన నేపథ్యంలో ఈ చిత్రానికి మంచి క్రేజ్ ఏర్పడింది. కలెక్షన్లపరంగా మామ, కోడళ్లు ధమాకా చేసేస్తున్నారు. తొలిరోజున ఈ సినిమా కలెక్షన్లు కూడా భారీగానే వసూళైనట్టు ట్రేడ్ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.

చైతూతో వివాహం తర్వాత
నాగచైతన్య, సమంత వివాహం ఈ నెల 6న గోవాలో జరిగిన సంగతి తెలిసిందే. దాంతో సమంత అక్కినేని కోడలుగా మారింది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ మన్మథుడు నాగార్జున, సమంత కలిసి నటించిన ఈ చిత్రంపై మంచి క్రేజ్ పెరిగింది. తొలిరోజున తెలుగు రాష్ట్రాల్లోనూ, ఓవర్సీస్ మార్కెట్లో మంచి కలెక్షన్లను రాబట్టినట్టు తెలుస్తున్నది. తొలి రోజు కలెక్షన్లు ఇలా ఉన్నాయి..

తొలి రోజు కలెక్షన్లు 4.5 కోట్ల
రాజుగారి గది2 చిత్రం తొలి రోజున రూ.4.5 కోట్లు రాబట్టింది. అమెరికాలో ప్రదర్శించిన ప్రీమియర్ షోల ద్వారా 53 లక్షలు వసూలు చేసింది. అమెరికాలో దాదాపు 87 సెంటర్లలో ఈ చిత్రం విడుదలైంది. అని ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్శ్ పేర్కొన్నారు.

తెలుగు రాష్ట్రాల్లోనూ సూపర్
తొలి రోజున తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు భారీగానే నమోదయ్యాయి. నైజాంలో ఈ చిత్రం రూ.1.55 కోట్లు, సీడెడ్‌లో 50 లక్షలు, వైజాగ్‌లో 45 లక్షలు, కృష్ణాలో 27 లక్షలు, పశ్చిమ గోదావరిలో 26 లక్షలు, నెల్లూరు 16 లక్షలు, గుంటూరులో 50 లక్షలు వసూలు చేసింది.

నాగ్ కెరీర్‌లో అత్యుతమైన..
కెరీర్ పరంగా నాగార్జున తొలిరోజు కలెక్షన్లను పరిశీలిస్తే మంచి రికార్డే నమోదైంది. అమెరికాలో ఈ చిత్రం 80.916 డాలర్లు వసూలు చేసి నాగ్ కెరీర్‌లోనే అత్యుత్తమ రికార్డుల్లో ఒకటిగా నమోదైంది. గతంలో నాగ్ నటించిన ఊపిరి 76,804, సోగ్గాడే చిన్ని నాయనా 50,523 డాలర్లు, మనం 95,473 డాలర్లు వసూలు చేశాయి.

శాటిలైట్ హక్కుల రూపంలో 24 కోట్లు
రాజుగారి గది రిలీజ్‌కు ముందే శాటిలైట్, ఇతర హక్కుల ద్వారా సుమారు 24 కోట్ల బిజినెస్ జరిగింది. ప్రేక్షకుల సానుకూల స్పందన ఈ చిత్రానికి అనుకూలంగా మారడంతో వారాంతంలో కూడా భారీ కలెక్షన్లను రాబట్టే అవకాశం ఉందనే టాక్ ఇండస్ట్రీలో వ్యక్తమవుతున్నది.

ఓంకార్ దర్శకత్వంలో..
టెలివిజన్ యాంకర్ ఓంకార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం హారర్, థ్రిల్లర్‌గా రూపొందింది. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, సీరత్ కపూర్, రావు రమేశ్, అశ్విన్ బాబు, ప్రవీణ్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి ముందు ఓంకార్ రాజుగారి గది2 సినిమాకు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











