»   » మున్నాభాయ్, త్రి ఇడియట్స్ డైరక్టర్ నెక్ట్స్ సినిమా డిటేల్స్

మున్నాభాయ్, త్రి ఇడియట్స్ డైరక్టర్ నెక్ట్స్ సినిమా డిటేల్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

మున్నాభాయ్ ఎంబిబియస్, లగేరహో మున్నాభాయ్,త్రి ఇడియట్స్ చిత్రాలుతో బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక స్ధానం ఏర్పాటు చేసుకున్న దర్శకుడు హిర్వానీ. ఆయన తదుపరి చిత్రం దేవుళ్ళ మీద తీయనున్నాడని సమాచారం. టాటుల్ హే భగవాన్ అని అనుకుంటున్నట్లు చెప్తున్నారు.ఇక ఈ విషయమై రాజ్ హిర్వాణి..తన అసెస్టెంట్ అభిజిత్ జోషిని తో డిస్కస్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనికి ఓ వెర్షన్ రాసినట్లు వినికిడి. దేశంలో ఉన్న రకరకాల దేముళ్ళు, వాటితో వచ్చే సమస్యలను ఈ చిత్రంలో డిస్కస్ చేయబోతున్నారు. త్రి ఇడియట్స్ ముగ్గురు ఇడియిట్స్ అంటూ విద్యా వ్యవస్ధపై చర్చ లేపితే, హే భగవాన్..300 మంది దేవుళ్ళ ఉన్న ఈ దేశం గురించి మాట్లాడుతుంది. ఇక ఈ కొత్త చిత్రం హిర్వాణి టిపికల్ ఫార్మెట్ లోనే...కామిడితో ఓ మంచి మెసేజ్ తో ఈ చిత్రం అద్యంతం నవ్విస్తూనే సందేశమిస్తుందని అంటున్నారు. మరో ప్రక్క రాజ్ హిర్వాణి...తన తాజా చిత్రం మున్నాభాయ్ సీక్వెల్ అయిన మున్నాభాయ్ ఛలో అమెరికా స్క్రిప్టు పూర్తి చేసే పనిలో ఉన్నారు. అదీ సంగతి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu