twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గంజాయివనంలో తులసి మొక్క

    By Staff
    |

    సినిమా పరిశ్రమలో సినిమా ప్రమోషన్ కోసం ఎన్నో స్కీములు బహుమతులు ప్రకటిస్తుంటారు. సినిమా విజయవంతం అయినా ఫయిల్ అయినా కూడా దాని గురించి మరచి పోతుంటారు. ఓక్క సినిమారంగంలోనే కాదు టి.వి. ఛానల్స్ కూడా పలు ప్రోగ్రామ్ లు పెట్టి వాటికి బహుమతులు భారీ ఎత్తున ప్రకటించి విజేతలకు బహుమతులు ఇవ్వరని ఓ ప్రముఖ యాంకర్ చెప్పింది. ఇలా ప్రేక్షకులను మభ్యపెట్టి వారి ఆశలతో ఆటలాడుకోవడం పరిపాటి. ఒక సినిమా విడుదలై పరిస్థితి తారుమారుగా ఉంటే మా సినిమా చూడండి చూసిన వారుతమ టికెట్ వెనుక అడ్రసు ఫోన్ నెంబర్ రాసి ధియేటర్లో ఉన్న బాక్స్ ల్లో వేస్తే లక్కీడ్రా తీసి వారికి ఫలానా బహుమతులు ఇస్తాము అని చెపుతూవుంటారు. సినిమా ఆగడితే దాన్ని మరిచి పోతారు. ఆడకపోతే అసలు ఆ నిర్మాత కనిపించడు. ఆ నిర్మాణ సంస్థ కనిపించదు. బహుమతులు వస్తాయని ఎదురు చూసి ప్రేక్షకులు మాకు రాలేదేమో అనుకుంటారు. తరువాత దాన్ని మరచిపోతారు. కొందరైతే ఈ సినిమా వాళ్ళు చెప్పేవన్నీ కట్టు కథలు అని పట్టించుకోరు. అయితే కొందరు మాత్రం చూద్దాం అని ఆలోచించే ఆశాజీవులు ఇలాంటి ప్రకటనలకు ఆకర్షింప బడుతుంటారు.

    ఇలా ఉంటున్న సినిమా పరిశ్రమలో గంజాయివనంలో తులసి మొక్కలాగా 'రాజు మహారాజు" చిత్ర నిర్మాత కుమారస్వామి. నిజంగా మహారాజు అనిపించుకున్నాడు. తాను తీసిన సినిమా బాగా ఆడలేడు. నష్టాలు వచ్చాయి. అయినా కూడా తాను సినిమా ప్రమోషన్ కోసం ప్రకటించిన బహుమతులను విజేతలకు అందజేసి మహారాజు అనిపించుకున్నారు. సినిమా ప్రారంభం నుండి ఆయన అనుభవ రాహిత్యం. మంచి తనం అనే రెండు వీక్ నెస్ లతో చిత్ర పరిశ్రమలోని చాలా మంది వారి చేతనైనంత వరకూ ఆదుకున్నా కూడా అతను మాత్రం వెరవలేదు. తాను అనుకున్న విధంగా సినిమా తీశాడు ఎవ్వరికీ కూడా పదిపైసలు బాకీ పెట్టలేదు. అడిగిన దానికంటే ఎక్కవే ఇచ్చాడు అందరూ నిర్మాత దేవుడు అని కొనియాడారు. నిర్మతంటే ఇలా ఉండాలి అని అన్నారు.

    సినిమా విడుదలైంది. భాగుందనే టాక్ వచ్చింది. తరువాత ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేదు. అయినా ఆయన తాను ఇచ్చిన ప్రకటన ప్రకారం లక్కీడీప్ ద్బారాఓ ఐదుగురికి బంగారు గాజులు, మరో ఐదుగురికి వెండి కుంకుమభరిణలు, మరో ఐదుగురికి పట్టుచీరలు ఇచ్చారు. అంతే కాదు ఈ కార్యర్రమానికి హాజరైన దర్శకుడికి నటీనటులను శాలువాలతో సన్మానించారు. అది చూసి అందరూ నీ మంచి తనం పాడుగానూ...ఇతను గంజాయివనంలో తులసి మొక్క అంటున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X