For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రాజుగారి గది 2 పై ట్వీట్ల వర్షం: ఫస్టాఫ్ కి ఫిదా అంటూ..., ట్విటర్ రివ్యూ రిపోర్ట్స్

  |

  రాజుగారి గది 2 పేద్ద ఆర్భాటమేమీ లేకుండా, అసలు మరీ పిచ్చెక్కించే అంచనాలు ఉన్నాయన్న విషయం కూడా పైకి కనిపించకుండా సైలెంట్ హిట్ కొట్టేసినట్టే అని ఇప్పటి వరకూ వచ్చిన పబ్లిక్టాక్. అసలు ఏ భారీ అంచనాలు లేకపోయినా ఇప్పటి వరకూ జరిగిన బిజినెస్ మాత్రం భారీగానే ఉంది. ఉదయం నుంచీ ట్విటర్ దుమ్ము లేచిపోతోంది. సినిమా బావుందంటూ హాష్ టాగ్ తో ట్వీట్లు వచ్చి పడుతూనే ఉన్నాయి. సైలెంట్ గా వచ్చి పెద్ద హిట్ కొట్టబోతున్న మామాకోడళ్ళ సినిమా పై ట్విటిజన్ల రిపోర్ట్

  రాజుగారి గది 2

  రాజుగారి గది 2

  సినిమా శాటిలైట్ సూపర్ రేట్ కు ఓ చానెల్ ఎగరేసుకుకపోయినట్లు తెలుస్తోంది. ఈ డీల్ వల్ల పివిపి సంస్థకు 8కోట్లు వచ్చింది. హిందీ డబ్బింగ్, డిజిటల్, ఆల్ రైట్స్ రెండు కోట్లకు ఇచ్చేసారు. అంటే అక్కడే టోటల్ 10కోట్ల రికవరీ అయిపోయింది. ఇక ఈస్ట్, వెస్ట్, కృష్ణా, గుంటూరు, సీడెడ్, కర్ణాటక అమ్మేసారు. అక్కడ ఏడు నుంచి ఎనిమిది రికవరీ అయిపోయింది.

  Raju Gari Gadhi 2 Movie Public Review : A Must Watch Movie For This Weekend - Filmibeat Telugu
  మంచి ఓపెనింగ్స్

  మంచి ఓపెనింగ్స్

  అంటే టోటల్ ఖర్చు పెట్టినది అంతా వచ్చేసినట్లే. ఇక పంచుకోవడానికి లాభాలు రావాలి. మాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్, పివిపి, పల్స్ డైరక్టర్ ఓంకార్ షేర్ అన్నమాట. అందుకోసం నైజాం, వైజాగ్, ఓవర్ సీస్ వుండనే వున్నాయి. ప్రస్తుతానికి మంచి ఓపెనింగ్స్ వుండేలా కనిపిస్తున్నాయి.

  ఫస్టాఫ్ మొత్తం అదిరి పోయిందట

  ఫస్టాఫ్ మొత్తం అదిరి పోయిందట

  బుకింగ్ ఆప్స్ లో ఫస్ట్ డే ఫుల్స్ అప్పుడే బాగానే కనిపిస్తున్నాయి. థియేటర్లు అన్నీ ఖాళీగా వున్నాయి కాబట్టి, థియేటర్ల సమస్య వుండదు. సో...! ఈ సారి పీవీపీకి మంచి హిట్ దక్కినట్టే... ఇక పొద్దున్నుంచీ ట్విటర్ లో కూడా సినిమాకి మంచి టాకే వచ్చింది. ఫస్టాఫ్ మొత్తం అదిరి పోయిందట, కామెడీ, సమంతా పాత్ర తీరూ అద్బుతంగా ఉందన్నది ట్విటిజన్ల ఉవాచ...

  తాజా రిపోర్ట్

  తాజా రిపోర్ట్

  తాజా రిపోర్ట్ ప్రకారం హర్రర్, కామెడీ జోనర్‌లో తెరకెక్కిన ఈమూవీపై పాజిటివ్ టాక్ వస్తుంది. ముఖ్యంగా సమంత నటన సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని.. సెకండాఫ్‌లో ఎమోషన్స్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకునేవిధంగా ఉంటాయని తెలుస్తోంది. ముఖ్యంగా నాగార్జున-సమంత మధ్య వచ్చే సీన్‌లు సినిమాను ఓ స్థాయికి తీసుకువెళ్లేవిధంగా ఉంటాయంటున్నారు. ఇక హైటెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కించిన ఈ మూవీలో గ్రాఫిక్స్ బాగా వచ్చాయని, థమన్ మ్యూజిక్ సినిమాకు బలాన్నిచ్చేదిగా ఉందంటున్నారు.

  సమంత ఆత్మ

  సమంత ఆత్మ

  ఓ ఆత్మ చుట్టూ సినిమా కథ సాగుతుంది..ఓ ఇంట్లో సమంత ఆత్మ ఉంటుంది. అదే ఇంట్లోకి నలుగురు ఫ్రెండ్స్ వెళ్లతారు. రోజు రాత్రి కాగానే రకరకాల శబ్దాలతో ఆ ఇల్లంతా భయంకరంగా ఉంటుంది. దీంతో మానసిక వైద్యుడు అయిన నాగార్జున పిలిపిస్తారు. నాగ్ ఆ ఇల్లును చూసి అందులో ఆత్మ ఉందని చెపుతాడు.

   నాగార్జున

  నాగార్జున

  దీంతో ఆ ఆత్మ ను బయటకు పంపేందుకు నాగార్జున తీవ్రంగా శ్రమిస్తాడు..ఇంతకీ ఆ ఆత్మ బయటకు వెళుతుందా లేదా..? అసలు సమంత ఆత్మ గా ఎందుకు అయ్యింది..? ఆ ఇంట్లోనే ఎందుకు ఉండాల్సి వచ్చింది..? అనేది అసలు కథ. ఈ లైన్ ఆకట్టుకోవటం తో పాటు గా నటీనటుల పర్ఫార్మెన్స్ పరిధులు దాటకుండా ఆకట్టుకుందనే టాక్ వినిపిస్తోంది.

   సుచీలీక్స్‌ కాంట్రవర్సీ

  సుచీలీక్స్‌ కాంట్రవర్సీ

  ఈ క్యారెక్టర్‌ చేసిన సమయంలో సోషల్‌ మీడియాలో ‘సుచీలీక్స్‌' పేరుతో కాంట్రవర్సీ జరిగింది. ఆ వీడియో ఓపెన్‌ చేసినవాళ్లకు, చూసిన వాళ్లకు, సర్య్కులేట్‌ చేసిన ప్రతి ఒక్కరికీ ఈ పాత్ర సందేశం ఇస్తుంది. ఇందులో ఏడ్చిన ప్రతిసారీ గ్లిజరిన్‌ వాడకుండా చేశా'' అంటూ సమంతా చెప్పిన మాటలతో ఆమె పాత్రమీద మరింత ఆసక్తి పెరిగింది.

  ....
  English summary
  Nagarjuna, Samantha LatesT Movie Rajugari Gadi 2 Directed by Omkar Released Today, here is the Twitter Talk
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X