విషాదం: యువ హీరో ప్రాణాలు తీసిన రాచపుండు
కన్నడ హీరో రాకేష్ అనారోగ్యంతో మరణించారు. కొంతకాలంగా ఆయన రాచపుండుతో బాధ పడుతున్నారు.
కన్నడ యువ హీరో రాకేష్(27) అనారోగ్యంతో మరణించారు. గత కొంతకాలంగా గ్యాంగ్రిన్ (రాచపుండు) వ్యాధితో బాధపడుతున్న ఆయనకు రెండు నెలల క్రితం ఆపరేషన్ కూడా జరిగింది. ఇటీవల వ్యాధి తిరిగబెట్టడంతో ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ మరణించారు.
బాల నటుడిగా కెరీర్ ప్రారంభించిన రాకేష్ పలు కన్నడ హిట్ చిత్రాల్లో నటించాడు. హీరోగా కూడా కొన్ని సినిమాలు చేశాడు. అభిమానులు అభిమానులు అతన్ని 'బుల్లీ' అని ముద్దుగా పిలుచుకుంటారు.

టాలెంటెడ్ యాక్టర్
రాకేష్ తల్లిదండ్రులు ఆశారాణి, నాగేష్ లు కూడా నటులే. చైల్డ్ ఆర్టిస్టుగా 'చెలువినచిత్తార'తో రంగ ప్రవేశం చేసిన రాకేష్, ఎన్నో చిత్రాల్లో నటించారు. టాలెంట్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు.

కబలించిన రాచపుండు
గ్యాంగ్రిన్ (రాచపుండు) వ్యాధితో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. రాకేష్ మరణంతో కన్నడ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది.

ఫలించని ప్రయత్నాలు
కోరమంగళలోని సెయింట్ జాన్స్ ఆసుపత్రిలో రాకేష్ కొంతకాలంగా చికిత్స పొందుతుతున్నారు. ఆయన్ను కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

సినిమాలు
రాకేష్ ఇప్పటి వరకు 40కిపైగా చిత్రాల్లో నటించాడు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం 'ధూమపాన' షూటింగ్ ముగింపు దశలో ఉంది. రాకేష్ మృతి పట్ల శాండల్ వుడ్ ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications











