Rakesh Master Death: రాకేష్ మాస్టర్ మరణానికి ఏపీ కల్తీ మద్యమే కారణమా? వీడియో వైరల్

తెలుగు సినీ ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ గా తనకంటూ స్పెషల్ ఇమేజ్ సంపాదించుకున్న రాకేష్ మాస్టర్ మరణించిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన జూన్ 18న హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ కన్ను మూశారు. జూన్ 19న సాయంత్రం అనేక మంది అభిమానుల మధ్య అంతిమయాత్ర నిర్వహించిన అనంతరం రాకేష్ మాస్టర్ దహన సంస్కారాలు చేశారు. ఇదిలా ఉంటే రాకేష్ మాస్టర్ మరణానికి అసలు కారణాలు ఏంటనేది చర్చనీయాంశంగా మారింది. తాజాగా మరో టాపిక్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.

విజయనగరంలో షూటింగ్:తెలుగు సినిమా ఇండస్ట్రీలో డ్యాన్స్ మాస్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నారు రాకేష్ మాస్టర్. వారం రోజుల క్రితం విజయనగరం ఔట్ డోర్ షూటింగ్ లో పాల్గొన్న ఆయన అనంతరం హైదరాబాద్ కి బయలు దేరారు. మార్గం మధ్యలోనే రాకేష్ మాస్టర్ తీవ్ర అనారోగ్యానికి గురికాగా హుటాహుటినా ఒక ఆసుపత్రిలో చేర్పించారు.

Rakesh Master Death Cause Is Andhra Pradesh Alcohol Video Viral

జూన్ 19న అంత్యక్రియలు:అప్పటి నుంచి అనారోగ్యంతో స్థానిక హాస్పిటల్లో చికిత్స తీసుకున్న రాకేష్ మాస్టర్ ఆదివారం అంటే జూన్ 18న ఉదయం ఇంట్లో రక్త విరోచనాలు చేసుకున్నారు. దీంతో ఆయన్ను గాంధీ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ సాయంత్ర తుది శ్వాస విడిచారు. ఇక జూన్ 19న సాయంత్ర అశేష అభిమానుల మధ్య అంతిమయాత్ర నిర్వహించి అంత్యక్రియలు జరిపించారు.

అనారోగ్యంతో కాదు:ఇదిలా ఉంటే ప్రస్తుతం రాకేష్ మాస్టర్ మరణానికి గల కారణాలు హాట్ టాపిక్ అవుతున్నాయి. డయాబెటిక్, బీపీ, షుగర్ లెవెల్స్ పెరగడం, ఆర్గాన్స్ అన్నీ ఫెయిల్ కావడంతో రాకేష్ మాస్టర్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆయన మరణం అనారోగ్యంతో కాదని, పలు అనుమానాలు ఉన్నాయని రాకేష్ మాస్టర్ కుమార్తె ఆరోపించారు.

Rakesh Master Death Cause Is Andhra Pradesh Alcohol Video Viral

ఆ బీర్లు తాగే:ఇప్పుడు తాజాగా ఏపీలోని నకిలీ మద్యం వల్లే రాకేష్ మాస్టర్ మరణించారని కొత్త చర్చ నెట్టింట్లో జోరుగా నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో లభిస్తున్న బూమ్ బూమ్ బీర్లను రాకేష్ మాస్టర్ విపరీతంగా తాగడం వల్లే అనారోగ్యం పాలయ్యారని, రక్త విరేచనాలతో ఆసుపత్రిలో చేరి చివరికి ప్రాణాలు కోల్పోయారని సోషల్ మీడియాలో పోస్టులు దర్శనం ఇస్తున్నాయి.

తిక్క తిక్కగా ఉంది:రాకేష్ మాస్టర్ బూమ్ బూమ్ బీరు తాగుతూ చేసిన చివరి వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. "నేను ఏపీ నుంచి తెలంగాణకు వెళ్తున్నందుకు మందుబాబులు అందరికీ గిఫ్ట్ ఇద్దామనుకుంటున్నాను. ఎండకాలం వేడికి.. గొంతులో చల్లగా ఉండేందుకు బూమ్ బూమ్. నాకు ఇది తాగిన తర్వాత తిక్క తిక్కగా ఉంది. ఏం మాట్లాడుతున్నానో అర్థం కావట్లేదు. కుడితిలో ఎలుక పడినట్లు ఉంది నా పరిస్థితి" అని రాకేష్ మాస్టర్ వీడియోలో తెలిపారు.

ప్రభుత్వం తప్పేముంది:"రాకేష్ మాస్టర్ ఆంధ్ర మందు తాగడం చూసా. అప్పుడే అనుకున్న ఏమైనా అవుతుందేమో అని. నాణ్యత లేని కల్తీ మందు కూడా ప్రాణాలకు ప్రమాదం" అని ఓ నెటిజన్ అంటే.. "రాకేష్ మాస్టర్ కు మద్యం తాగే అలవాటు ఎక్కువగా ఉంటే అందులో ఏపీ ప్రభుత్వానిది తప్పేముంది" అని మరికొంతమంది అంటున్నారు. ఇలా రాకేష్ మాస్టర్ మరణానికి గల కారణాలపై పలువురు పలు విధాలుగా చర్చిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X