»   » కృష్ణవంశీ వాడో పెద్ద డైరెక్టరా?.. వాడి అమ్మ గొడవ.. పైసా ఇవ్వలేదు.. రాకేశ్ మాస్టర్ దండకాలు

కృష్ణవంశీ వాడో పెద్ద డైరెక్టరా?.. వాడి అమ్మ గొడవ.. పైసా ఇవ్వలేదు.. రాకేశ్ మాస్టర్ దండకాలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినీ పరిశ్రమలో సక్సెస్ ఉన్నంత కాలం ఎవర్నైనా ఆకాశానికి ఎత్తేస్తారు. ఫెయిల్యూర్‌ కనిపించగానే సదరు వ్యక్తిని చీల్చి చెండాడుతారు. ఇది టాలీవుడ్‌లోనూ చాలా సహజంగా కనిపించే విషయం. ఇందుకు క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ అతీతుడేమీ కాదు. తాజాగా కృష్ణవంశీపై ఓ కోరియోగ్రాఫర్ విరుచుకుపడటం చర్చనీయాంశమైంది. కృష్ణవంశీపై తీవ్ర ఆరోపణలు చేయడం వివాదాస్పదమైంది. ఈ ఆరోపణలు చేసింది టాలీవుడ్‌లో ప్రముఖ డ్యాన్స్ డైరెక్టర్ రాకేశ్ మాస్టర్. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్‌ కిచ్చిన ఇంటర్వ్యూలో కృష్ణవంశీ, ప్రభాస్‌పై నిప్పులు చెరిగాడు.

సిగరెట్ తాగుతూ డ్యాన్స్ చేయమన్నాడు..

సిగరెట్ తాగుతూ డ్యాన్స్ చేయమన్నాడు..

చక్రం సినిమా సమయంలో జగమంత కుటుంబం పాటకు డ్యాన్స్ కంపోజ్ చేయడానికి కృష్ణవంశీ నన్ను పిలిపించారు. ఆయన ఆఫీస్‌కు వెళ్లి కలిశాను. కృష్ణవంశీ సిగరెట్ తాగుతూ డ్యాన్స్ చేసి చూపించు అని అన్నాడు. విషయం చెప్పకుండా డ్యాన్స్ ఎలా చేస్తాం అని అన్నాను. వాడి అమ్మ గొడవ. వాడో పెద్ద డైరెక్టర్ అంటూ దండకాలు అందుకొన్నారు. మనిషిని ఎంత హింసించాలో అంత హింసించాడు.

11 రోజులు షూట్ చేసి..

11 రోజులు షూట్ చేసి..

ఆ పాటకు అసలు డ్యాన్స్ లేదు. కానీ నన్న టెస్ట్ చేశాడు. 11 రోజులు సాంగ్ చేశాం. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. నన్ను పక్కనపెట్టి అన్నీ ఆయనే చేసుకున్నాడు. అందుకే ఆ సినిమా అలా తయారైంది.

నీతులు చెప్పి.. పరమ నీచంగా..

నీతులు చెప్పి.. పరమ నీచంగా..

తమ సినిమాలతో వెండితెరపై నీతులు చెప్పే దర్శకులు కొందరు రియల్ లైఫ్ లో మాత్రం పరమ నీచంగా ఉంటారు. నలుగురికి ఆదర్శంగా నిలవాల్సిన డైరక్టర్లు.. తమ కక్కుర్తి బుద్ధి, ఇగోతో వార్తల్లో నిలిచిన సందర్భాలు చూస్తూనే ఉన్నాం. సీనియర్ డైరక్టర్ కృష్ణవంశీ కూడా అలాంటివాడే అంటున్నాడు కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్. కృష్ణవంశీకి జోగి బ్రదర్స్ వంతపాడేవాళ్లు. వాళ్లు బఫూన్స్ అని అన్నాడు.

అందుకే రోడ్డున పడ్డాడు..

అందుకే రోడ్డున పడ్డాడు..

అదేం క్రియేటివిటీనో అర్థం కాదు. అలాంటి (డాష్) డైరక్టర్ ను నా లైఫ్ లో మరిచిపోలేను. ఆయన జనాలకు క్రియేటివ్ డైరక్టర్ అవ్వొచ్చు. నా దృష్టిలో బచ్చా డైరక్టర్. ఇప్పుడేమైంది. రోడ్డున పడ్డాడు. హిట్స్ లేవు. టెక్నీషియన్'ను అవమానిస్తే ఇలానే ఉంటుంది. ఇండస్ట్రీ ఒకడి అబ్బా సొమ్ము కాదు. అందుకే అలా అయ్యాడు.

వాడో పెద్ద వెధవ..

వాడో పెద్ద వెధవ..

11 రోజులు షూటింగ్ చేసిన తర్వాత మళ్లీ రీషూట్ అన్నాడు. పైసా ఇవ్వలేదు. అన్నీ అతడే చేసుకొన్నాడు. ఫోజుల కొడుతాడు. అన్నం పెట్టి తినకుండా చేసే విధంగా కృష్ణవంశీ ప్రవర్తిస్తాడు. వాడు పెద్ద వెధవ. నేను భయపడను. నేను మాట్లాడిన ప్రతీ విషయం ప్రసారం కావాలి. దీంతో కృష్ణవంశీ బాధితులు మరికొందరు వస్తారు. టెక్నిషియన్స్‌ను అనుమానించకు అని రాకేశ్ మాస్టర్ హెచ్చరించారు.

జోగి బ్రదర్స్ జఫాలు..

జోగి బ్రదర్స్ జఫాలు..

జోగి బ్రదర్స్ లాంటి జఫాలను పక్కన పెట్టుకోవడం మానేసి సినిమాలపై దృష్టిపెడితే మంచిది. ఇండస్ట్రీకి ఆయన ఇచ్చిన హిట్లు ఏంటీ? ఆయనకంటే వెనుక వచ్చిన వాళ్లు బాగా రాణిస్తున్నారు. ఈయన పరిస్థితి ఏంటో అందరికి తెలుసు. టెక్నీషియన్లు గౌరవించాలని తెలుసుకోవాలి. అందుకే సోషల్ మీడియా ద్వారా ఆయన ప్రవర్తనను బయటపెడుతున్నాను అని రాకేశ్ మాస్టర్ అన్నారు.

ఇంకా బండబూతులు..

ఇంకా బండబూతులు..

ఇది మచ్చుకు మాత్రమే. ఇక్కడ రాయలేని ఎన్నో బూతులు తిట్టాడు కృష్ణవంశీని. ఇండస్ట్రీలో ఈ దర్శకుడిపై చాలా మందికి కోపం ఉంది. కొంతమంది సన్నిహితుల దగ్గర చెప్పుకొని బాధపడితే, మరికొందరు అనధికారికంగా ఫిర్యాదులు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.

courtesy: Volga Vieo

English summary
Dance Director Rakesh master fires on Krishna Vamshi. He said Krishnavamshi misbehaved with me. After 11 days of shooting he has not paid single paisa to me. He is a worst fellow
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu