Rakesh Master రాకేష్ మాస్టర్ అంత్యక్రియలు పూర్తి.. పాడే మోస్తూ భోరున విలపించిన శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్

ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ తన అభిమానులను, శ్రేయోభిలాషులు, సన్నిహితులు, సినీ ప్రముఖులను విషాదంలోకి నెట్టి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. వైజాగ్‌లో ఓ సినిమా షూటింగ్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. గాంధీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. పలు అవయవయాలు పనిచేయకపోవడం వల్లే ఆయన మరణించారని వైద్యులు వెల్లడించారు. అయితే ఆయన అంత్యక్రియల వివరాల్లోకి వెళితే..

గాంధీ హాస్పిటల్ నుంచి రాకేష్ మాస్టర్ భౌతికకాయాన్ని హైదరాబాద్ బోరబండలోని నివాసానికి తరలించారు. ఆయన మరణ వార్త తెలిసిన వెంటనే తన స్నేహితులు, అభిమానులు గాంధీ హాస్పిటల్‌కు వెళ్లి శ్రద్దాంజలి ఘటించారు. సోమవారం ఉదయం అభిమానుల సందర్శనార్థం బోరబండలోని నివాసంలో రాకేష్ మాస్టర్ పార్థీవదేహాన్ని ఉంచారు.

రాకేష్ మాస్టర్ చివరి చూపు కోసం ఆయన శిష్యులు భారీగా తరలివచ్చారు. ఆయన శిష్యులు శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ బోరబండకు వచ్చి శ్రద్దాంజలి ఘటించారు. అంత్యక్రియల ఏర్పాట్లు చేసి వారిద్దరూ సహకారం అందించారు. రాకేష్ మాస్టర్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ స్వయంగా పాడెను మోసి తన గురువు రుణం తీర్చుకొన్నారు.

తమకు మంచి జీవితాన్ని ప్రసాదించిన రాకేష్ మాస్టర్‌ భౌతిక కాయాన్ని చూసి జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ భావోద్వేగానికి గురయ్యారు. ఓ దశలో తమ ఎమోషన్స్ తట్టుకోలేక భోరున విలపించారు. కంటతడి పెట్టుకోవడం అక్కడి వారిని కలిచి వేసింది. చివరి వరకు రాకేష్ మాస్టర్‌ అంతిమ యాత్రలో పాల్గొన్నారు.

Rakesh Master funerals completed at boraband of Hyderabad

రాకేష్ మాస్టర్ అంత్యక్రియలు భారీగా అభిమానుల తరలిరాగా భావోద్వేగాల మధ్య ముగిసాయి. బోరబండ స్మశాన వాటికలో తాను ముందే నిర్మించుకొన్న సమాధి వద్ద అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన కోరిక మేరకు ఆయన దేహానికి హిందూ సాంప్రదాయ పద్దతులతో అంత్యక్రియలు చేశారు. తన మరణానికి ముందే నిర్మించుకొన్న సమాధి ఫోటోను ఆయన అభిమానులు సోషల్ మీడియాలో భారీగా షేర్లు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X