రాకేష్ మాస్టర్ చివరి కోరిక.. వాళ్ల ద్వారా జీవితంపై విరక్తి.. కుటుంబ సభ్యుల సమ్మతితో అలా!
చిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. తెలుగు సినీ ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ గా తనకంటూ స్పెషల్ ఇమేజ్ సంపాదించుకున్నారు రాకేష్ మాస్టర్. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం అంటే జూన్ 18న హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ లో సాయంత్రం చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. సెలబ్రిటీలు ఆయన మరణం పట్ల సంతాపం తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాకేష్ మాస్టర్ చివరి కోరిక ఏంటనేది చర్చనీయాంశంగా మారింది.
హుటాహుటినా:తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న రాకేష్ మాస్టర్ అనారోగ్యంతో కన్నుమూశారు. వారం రోజుల క్రితం వైజాగ్ ఔట్ డోర్ షూటింగ్ లో పాల్గొన్న ఆయన ఆ పనులన్నీ పూర్తి చేసుకొని హైదరాబాద్ కి బయలు దేరారు. మార్గం మధ్యలోనే రాకేష్ మాస్టర్ తీవ్ర అనారోగ్యానికి గురికాగా ఆయన్ను హుటాహుటినా ఒక ఆసుపత్రిలో చేర్పించారు.

రక్త విరోచనాలు:అప్పటి నుంచి అనారోగ్యంతో స్థానిక హాస్పిటల్లో చికిత్స తీసుకున్న రాకేష్ మాస్టర్ ఆదివారం ఇంట్లో రక్త విరోచనాలు చేసుకున్నారు. రాకేష్ మాస్టర్ పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీ వైద్యులు విశ్వప్రయత్నం చేసినా రాకేష్ మాస్టర్ తనువు చాలించారు.

శ్వాస అందించినా:రాకేష్ మాస్టర్ డయాబెటిక్ అని తెలిసింది. సివియర్ మెటబాలిక్ ఎసిడోసిన్ కావడంతో మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ అయ్యాయి. బీపీ లెవెల్స్ పూర్తిగా పడిపోయాయి. హై షుగర్ కూడా ఉండటంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. కృత్రిమంగా శ్వాస అందించే ప్రయత్నం చేసినా ఫలించలేదు. రాకేష్ మాస్టర్ మృతితో నెటిజన్లు, ప్రేక్షకులు దిగ్భ్రాంతికి లోనయ్యారు.
అక్కడే సమాధి:అయితే గతంలో తాను చనిపోతే ఆయన్ను ఎక్కడ సమాధి చేయాలో ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో చెప్పారు రాకేష్ మాస్టర్. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తన అంతిమ యాత్ర ఎలా ఉంటుందో చూసుకోవాలనిపించి సంబంధింత వీడియోను ముందే తీశామని అందులో పేర్కొన్నారు. తన మామగారు (భార్య తండ్రి) సమాధి పక్కన ఒక వేప మొక్కను నాటారట. తను మరణించాక ఆ చెట్టు కిందే సమాధి చేయాలని రాకేష్ మాస్టర్ కోరారు.

జీవితంపై విరక్తి:తన తమ్ముడు అంటే చాలా ఇష్టమని, తను చనిపోయినప్పుడు చాలా బాధిపడినట్లు తెలిపారు రాకేష్ మాస్టర్. అలాగే తన తల్లి చనిపోవడంతో జీవితంపై విరక్తి పుట్టిందని చెప్పారు. తన అక్క కుమారుడితోపాటు తండ్రి కూడా మరణంచిడంతో జీవితంలో చావు అంటే భయం పోయిందని ఆ ఇంటర్వ్యూలో రాకేష్ మాస్టర్ చెప్పుకొచ్చారు.

అంత్యక్రియలు:ఇదిలా ఉంటే రాకేష్ మాస్టర్ కు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. రాకేష్ మాస్టర్ మరణానికి ముందు కళ్లను దానం చేయాలనుకున్నారు. అలా రాకేష్ మాస్టర్ కళ్లను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు అంగీకారం తెలిపారు. తండ్రి చనిపోయాడన్న బాధలో కూడా ఇలాంటి మంచి పని చేసి గొప్ప మనసు చాటుకున్నారని నెటిజన్లు అంటున్నారు. ఇక సోమవారం అంటే ఇవాళ బోరబండలో రాకేష్ మాస్టర్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.


Click it and Unblock the Notifications











