రూ. 1000 కోట్లు...వసూలవుతాయనే నమ్మకంతో నిర్మాత!
ముంబై: ప్రస్తుతం ఇండియన్ సినిమా కలెక్షన్ల రేంజి ఎంత? మాగ్జిమమ్ రూ. 300 కోట్లు. ఏదైనా అద్భుతం జరిగేతే 400 కోట్లు వసూలయ్యే అవకాశం ఉంది. ఇది ఇండియన్ సినీ పరిశ్రమలో అత్యధిక మార్కెట్ పరిధి కలిగి ఉండి నెం.1 స్థానంలో కొనసాగుతున్న బాలీవుడ్ పరిస్థితి. అయితే తమ సినిమా రూ. 1000 కోట్ల మార్కును అందుకుంటుందనే నమ్మకంతో ఉన్నారు క్రిష్-3 చిత్ర నిర్మాత రాకేష్ రోషన్.
నవంబర్ 1న సినిమా విడుదలకు సిద్ధం అవుతున్న నేపథ్యంలో ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో....రూ. 1000 కోట్లు మార్కును అందుకుంటుందనే వ్యాఖ్యలు చేసారు రాకేష్. ఆయన నవ్వుతూ సరదాగా ఈ వ్యాఖ్యలు చేసినప్పటికీ, ఆయన కళ్లలో 'క్రిష్-3' చిత్రం భారీ వసూళ్లు సాధిస్తుందనే ఆత్మ విశ్వాసం కనిపించింది.
గతంలో బాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ మూవీస్ కోయి మిల్ గయా, క్రిష్ చిత్రాలకు సీక్వెల్‌గా క్రిష్-3 చిత్రం రూపొందుతోంది. హృతిక్ రోషన్‌తో పాటు వివేక్ ఒబెరాయ్, కంగనా రనౌత్, ప్రియాంక చోప్రా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్ స్వీయన నిర్మాణ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈచిత్రపై భారీ అంచనాలున్నాయి.


Click it and Unblock the Notifications












