twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాఖీ ఎంతవరకూ వచ్చింది?

    By Staff
    |

    అశోక్‌ చిత్రం తర్వాత ఎన్టీఆర్‌ చేస్తున్న సినిమా రాఖీ. వరుస వైఫల్యాలు ఎదుర్కొంటున్న ఈ హీరోకి ఈ చిత్ర విజయం ఎంతో అవసరం. అందుకే ఈ చిత్రం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తయారవుతోంది. శ్రీ దుర్గా ఆర్ట్స్‌ పతాకంపై కె.ఎల్‌. నారాయణ, ఎస్‌. గోపాలరెడ్డి సంయుక్త నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రానికి క్రియేటివ్‌ డైరెక్టర్‌ కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.

    రాఖీ షూటింగ్‌ ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో శరవేగంగా సాగుతోంది. ఫిలింసిటీలో కొన్ని యాక్షన్‌ దృశ్యాలతో పాటు పలు సన్నివేశాలు కూడా చిత్రీకరిస్తున్నారు కృష్ణవంశీ.

    ఈ సినిమా ఎన్టీఆర్‌కు ఎంత ముఖ్యమో దర్శకుడు కృష్ణవంశీకి కూడా అంతే ముఖ్యం. అందుకే ఈ చిత్రాన్ని కృష్ణవంశీ ఎంతో జాగ్రత్తగా మలుస్తున్నారని ఫిలింవర్గాల కథనం. రాఖీలో ఎన్టీఆర్‌ క్యారెక్టరైజేషన్‌ విభిన్నంగా ఉంటుంది. అయితే, ఈ సినిమా గురించి ఎటువంటి వివరాలూ బయటకి పొక్కకుండా చిత్రం యూనిట్‌ ఎంతో జాగ్రత్త వహిస్తోంది. ఒక కథనం ప్రకారం ఇది ప్రధానంగా చెల్లెలు సెంటిమెంట్‌తో కూడిన ఇతివృత్తం అని చెబుతున్నారు.

    సికిందరాబాద్‌ శివార్లలో ఈ సినిమా కోసం ఒక ప్రత్యేకమైన సెట్‌ కూడా రూపొందించారు. కొంత భాగం, పాటలూ బ్యాంకాక్‌, పరిసర ప్రదేశాలలో షూటింగ్‌ చేశారు కూడా. దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందించారు.

    డిసెంబర్‌ 22న ఈ సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది.

    మరిన్నికథనాలు

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X