షేపు కోసం 'బ్రెస్ట్ ఇంప్లాట్స్' తీయించేసా
అప్పట్లో 'బ్రెస్ట్ ఇంప్లాట్స్' ఆపరేషన్ చేయించుకుని కృత్రిమంగా కొలతలు పెంచుకున్న రాఖీ సావంత్ మళ్ళి మరో ఆపరేషన్ చేయించుకుంది. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ.."గ్లామర్‌గా కనిపించడం కోసం అప్పట్లో శస్త్ర చికిత్స చేయించుకున్నాను కానీ బ్రెస్ట్ ఇంప్లాంట్స్ వల్ల చాలా ఇబ్బంది పడ్డాను. నేను ఐటెమ్ సాంగ్స్ ఎక్కువగా చేస్తున్న సంగతి తెలిసిందే. డాన్స్ చేస్తున్నప్పుడు నాకు చాలా ఇబ్బందిగా ఉండేది. పరుపు మీద వాలగానే హాయిగా కునుకు పట్టేది కాదు. అసౌకర్యంగా ఉండేది. అందుకే మళ్ళీ ఆపరేషన్ చేయించుకుని సరిచేయించుకున్నాను..దాంతో ఇప్పుడు నాకు ఏ సమస్యా లేదు' అంటోంది రాఖీ. అలాగే తనకు 36-24-36 సైజు కన్నా పెరిగినా తగ్గినా చాలా కష్టం అనిపిస్తుందని అలాంటప్పుడు ఆపరేషన్స్ అవసరం అవుతున్నాయని చెప్తోంది.
అప్పటికీ అప్పట్లో బక్కపల్చగా ఉన్న తాను ఈ మధ్యకాలంలో అధిక బరువుతో బాధపడ్డానంటోంది. దాంతో బరువు తగ్గించటానికి నానా యాతన పడ్డానంటోంది. స్నేహితులు చెప్పారని పవర్ యోగా మొదలుపెట్టాను. పండ్ల రసాలు ఎక్కువగా, ఘనాహారం తక్కువగా తీసుకున్నాను. ఫలితంగా కొంత సన్నబడ్డారు. కొలతలు కూడా తగ్గాయి. కానీ అనుకున్నంత షేప్ వర్కవుట్ కాలేదు. దాంతో మరోసారి ఆపరేషన్ టేబుల్ ఎక్కి 'బ్రెస్ట్ ఇంప్లాంట్స్'ని తీయించేసుకున్నాను. ఆహా..ఇప్పుడు నాది సహజ సౌందర్యం కదా అంటూ మురిసిపోతోంది రాఖీ సావంత్. అవును మరి హాట్ గర్ల్ గా ఏలాలంటే ఇలాంటి ఆపరేషన్స్ తప్పవు మరి అని బాలీవుడ్ కామెంట్స్ చేస్తోంది.


Click it and Unblock the Notifications











