దమ్ముంటే ఆ స్టార్ సినిమాని రీ సెన్సార్ చేయండంటూ..
రాఖీ సావంత్ రోజుకో కొత్త వివాదంతో ముందుకొస్తోంది.తాజాగా సెన్సార్ బోర్డు తన సినిమాలను అన్యాయం చేస్తోందని,తన పాటలను అన్యాయంగా కట్ చేసిందని ఆమె వాపోయింది.అంతేగాక స్టార్ హీరోల సినిమాలకు ఒక రకంగా తమ లాంటి వాళ్ల సినిమాలను మరో రకంగా సెన్సార్ చేస్తున్నారని వాపోయింది.జాన్ అబ్రహం,బిపాసా బసు లపై దేసీ బోయ్స్ సినిమాకోసం చిత్రీకరించిన పాట పూర్తి బూతుమయమని,దాన్ని రీసెన్సార్ చేయమని డిమాండ్ చేసింది. నిజంగా సెన్సార్ వాళ్లు అంత స్ట్రిక్ట్ గా ఉంటే ఆ పాటను రీ సెన్సార్ చేసి తమను తాము నిరూపించుకోవాలని సవాల్ విసిరింది.ఆ పాటలో జాన్ అబ్రహం ఓ స్టెప్ లో చాలా ఛండాలమైన అర్దం వచ్చేలా హావ భావాలు చూపాడని, అవేమీ సెన్సార్ వాళ్లకు కనపడవా అని నిప్పులు చెరిగింది. అయితే సెన్సార్ వాళ్లు వీటినేమీ పట్టించుకోక ఆమె నటించిన లూటీ చిత్రం లోని పాటపై పలు కట్స్ వేసారు..
అలాగే నాలుగు రోజుల క్రితం రాఖీ సావంత్...తన ఆఫర్స్ అన్నీ పేరున్న స్టార్ హీరోయిన్స్ కొట్టుకుపోతున్నారని,ఐటం గర్ల్స్ కి,హీరోయిన్స్ కి తేడా లేకుండా పోయిందని ఆమె చెప్పుకొచ్చింది. ఆమె మాటల్లోనే... బాలీవుడ్ లో ఒకప్పుడు హీరోయిన్లు విడిగా, ఐటం గర్ల్స్ విడిగా ఉండేవారు. ఇప్పుడా తేడా లేకుండా పోయింది. హీరోయిన్స్ అంతా ఐటం సాంగ్స్ చేయటానికి సై అంటున్నారు. అందులోనూ నిర్మాతలు కూడా హీరోయిన్ ఐటం సాంగ్ చేస్తే సినిమాకి మరింత క్రేజ్ పెరుగుతుంది అంటున్నారు. మమ్మల్ని ఎవరూ పట్టించుకోవటం లేదు.ఐటం గర్ల్ గా సినిమాల్లోకి వచ్చిన తమకు..హీరోయిన్స్ పాత్రలు రావని, కానీ హీరోయిన్స్ మాత్రం తమ పాత్రలను లాగేసుకుంటున్నారని ఏడుపు మొహంతో చెప్పుకొచ్చింది.ఇప్పుడిలా సెన్సార్ పై మండిపడుతోంది. ఇక ఈ దేశీబాయ్స్ చిత్రంలో అక్షయ్ కుమార్, జాన్ అబ్రహం,దీపికా పదుకోని,చిత్రాంగద సింగ్ వంటి స్టార్స్ నటిస్తున్నారు.దర్శకుడు రోహిత్ ధావన్ కిదే తొలి చిత్రం.రోహిత్ ధావన్ మరెవరో కాదు గతంలో ఎన్నో కామిడీ చిత్రాలు డైరక్ట్ చేసిన డేవిడ్ ధావన్ తనయడు. ఈ చిత్రం కూడా ఓ యాక్షన్ కామిడినే కావటం విశేషం.


Click it and Unblock the Notifications











